ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి కన్నుమూత
హైదరాబాద్ : ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి(40) కన్నుమూశారు. గుండెపోటుతో చక్రి మృతి చెందారు. ఇక చక్రి...జగపతిబాబు, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన బాచి సినిమాతో సంగీత దర్శకుడు అయ్యారు. ఆయన వరంగల్ జిల్లా మహబూబాబాద్ లో 1974 జూన్ 15న జన్మించారు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

చక్రి సంగీతం సమకూర్చిన పాటల్లో ఎన్నో హిట్స్ ఉన్నాయి. ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, సత్యం, ఈ మధ్య కాలంలో సింహా వంటి అనేక సూపర్ హిట్స్ ని ఇచ్చారు. అలాగే తమిళం,కన్నడ చిత్రాల్లో కూడా ఆయన సంగీతం అందించారు. ఆయన నటుడుగానూ రంగ ది దొంగ(శ్రీకాంత్) చిత్రంలో కనిపించారు.
ఆయన సంగీతం అందించిన రేయ్(సాయి ధరమ్ తేజ), తను మొన్నే వెళ్లిపోయింది(వంశీ దర్శకత్వం) ఇంకా విడుదలకావాల్సి ఉన్నాయి. వన్ ఇండియా తెలుగు చక్రి మృతికి సంతాపం తెలియచేస్తూ నివాళులు అర్పిస్తోంది.


Click it and Unblock the Notifications











