Don't Miss!
- News మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేలా మరింత ఉధృతంగా వైఎస్ జగన్ చివరి విడత ప్రచారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
శ్రీను వైట్ల పై ఫైర్ అయిన సంగీత దర్శకుడు చక్రి
ఆ సినిమా నేనింతవరకూ చూడలేదు. కానీ ఆ పాత్ర గురంచి విన్నాను. అది నా గురించి కాదని శ్రీను వైట్ల చెప్పారు. అయితే అది ఎవరి గురించి అయినా కానీ సాటి కళాకారుల మీద కామెడీ చేయటం తప్పు. సంగీత దర్శకులంటే సరస్వతీ పుత్రులు. వారిని అపహాస్యం చేయకూడదు. అది నా గురించి కాదనే అనుకుంటున్నాను. ఒకవేళ నా గురించే అయినా కానీ నేను పట్టించుకోను. ఏనుగు వెళతూంటే చాలా మొరుగుతూ ఉంటాయి. వాటిని పట్టించుకోకూడదు. అంటూ చక్రి తొలిసారిగా శ్రీను వైట్లపై ఫైర్ అయ్యారు. అప్పట్లో నాగార్జున కింగ్ సినిమాలో బ్రహ్మానందం తో మ్యూజిక్ డైరక్టర్ జయసూర్య పాత్రను పెట్టారు శ్రీను వైట్ల. ఆ పాత్ర కేవలం చక్రిని ఉద్దేశించేనని, ఆయన్ని ఎగతాళి చేయటానికేనని అంతటా వినపడింది. అయితే శ్రీను వైట్ల తనకు అలాంటి ఆలోచన ఏదీ లేదని స్టేట్ మెంట్ వెంటనే ఇచ్చారు. కానీ అలా శ్రీను వైట్ల స్పందించగానే వెంటనే అందరూ ఫిక్సయిపోయారు. కానీ ఈ విషయం తెలిసినా చక్రి తనకు సంభందం లేనట్లు అప్పట్లో ఉండిపోయి ఇన్నాళ్ళకు ఫైర్ అయ్యారు.