శృంగారతారతో సంగీత దర్శకుడు చక్రి
సుమన్, కాశీనాథ్, సంగీత దర్శకుడు చక్రి ముఖ్య పాత్రలు పోషిస్తున్న సినిమా విశేషాలను ఆయన వెల్లడిస్తూ ' చారిత్రక అంశాలు కలిగిన కథతో 'రామప్ప' చిత్రం నిర్మిస్తున్నందుకు ఆనందంగా ఉంది. మా దర్శకుడు అద్భుతంగా చిత్రాన్ని తెరకు ఎక్కిస్తున్నారు. సంగీత దర్శకుడు చక్రి పోషిస్తున్న పాత్ర చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. చక్రి, శిరీషపై చిత్రీకరించిన పాట చిత్రానికే హైలైట్‌గా నిలుస్తుంది. అతి త్వరలో ఆడియోను విడుదల చేస్తాం' అన్నారు.
కాకతీయుల కాలంలో నిర్మించిన చారిత్రక రామప్ప దేవాలయ ప్రాశస్త్యాన్ని తెలియజేస్తూ రూపొందిస్తున్న చిత్రం 'రామప్ప'. గణపతిదేవుడుగా సుమన్ ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. నిర్మాత కుమార్ మారబోయిన మాట్లాడుతూ 'గొప్ప చారివూతక నేపథ్యమున్న ఈ చిత్రాన్ని చక్కటి పరిశోధన చేసి తెరకెక్కిస్తున్నాం. రామప్ప కళా వైభవాన్ని ఈ చిత్రంలో ఆవిష్కరిస్తున్నాం. వరంగల్ జిల్లా రామప్పలో కొన్ని కీలక సన్నివేశాల్ని చిత్రీకరించాం అన్నారు.
సంగీత దర్శకుడు చక్రి పాత్ర చిత్రానికి ప్రధానాకర్షణగా నిలుస్తుంది. చక్రి, శిరీషలపై తీసిన పాట ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. రామప్పగా కాశీవిశ్వనాథ్ చక్కటి అభినయాన్ని కనబరుస్తున్నారు. త్వరలో ఆడియోను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అన్నారు. త్రివేణి, కాశీనాథ్, చక్రి (సంగీత దర్శకులు), జిల్లా వెంకటనారాయణ, సారిక రామచంవూదరావు, జూ॥ రేలంగి, కొండవలస, చిత్రం శ్రీను, తిరుపతి ప్రకాష్, విన్ని, అనుశ్రీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: యమ్. నాగేంవూదకుమార్, సంగీతం: మహత్, ఆర్ట్: విజయకృష్ణ, ఎడిటర్: కె.ఆర్.స్వామి.


Click it and Unblock the Notifications












