సంగీత దర్శకుడు చక్రి తండ్రి మృతి

By Srikanya

హైదరాబాద్ : ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి తండ్రి జిల్లా వెంకటనారాయణ మృతి చెందారు. ఆయన వయసు 73 ఏళ్లు. గురువారం గుండెపోటుతో కన్నుమూశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలున్నారు. చక్రి పెద్ద కుమారుడు. వెంకటనారాయణ వరంగల్‌ జిల్లా మహబూబాబాద్‌లో ప్రధానోపాధ్యాయుడిగా పని చేసి ఉద్యోగ విరమణ చేశారు.

వరంగల్ జిల్లా మహబూబాబాద్‌లోని కంబాలపల్లి ఆయన స్వగ్రామం. వెంకటనారాయణకు భార్య, ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడైన చక్రి సంగీత దర్శకునిగా తెలుగువారి అభిమానం చూరగొన్నారు. రెండవ కుమారుడు మహత్ కూడా సంగీత దర్శకుడే. ప్రధానోపాధ్యాయునిగా బాధ్యతలను నిర్వర్తించిన వెంకటనారాయణ... ఉత్తమ అధ్యాపకునిగా ప్రభుత్వ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. వెంకటనారాయణ మంచి వక్త, గాయకుడు కూడా. ధనలక్ష్మీ ఐ లవ్ యూ, లవ్ ఇన్ హైదరాబాద్ చిత్రాల్లో పాటలు కూడా పాడారాయన.

అలాగే ఆయన మంచి నటుడు కూడా. 'గోపి గోపిక గోదావరి', 'రంగ ది దొంగ', 'జై బోలో తెలంగాణా', 'వీడు తేడా' తదితర చిత్రాల్లో నటించారు. ఆయన నటించిన దేవరాయ, రామప్ప చిత్రాలు త్వరలో విడుదల కానున్నాయి. మరో రెండు చిత్రాల్లో నటించడానికి అంగీకరించిన వెంకటనారాయణ హఠాత్తుగా గుండెపోటుతో మరణించడం ఆయన కుటుంబాన్ని కలచివేసింది.

తండ్రి మరణించే సమయానికి చక్రి సంగీత చర్చల కోసం మలేసియా వెళ్లారు.ఈ వార్త విని గురువారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. శుక్రవారం అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ధట్స్ తెలుగు నివాళి అర్పిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X