For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చక్రిని ఉద్దేసించి కాదు: శ్రీను వైట్ల

    By Staff
    |

    Seenu Vytla
    'కింగ్'లో బ్రహ్మానందం జయసూర్య అనే సంగీత దర్శకుడిగా కనిపిస్తారు. ఆ పాత్ర, హావభావాలూ సినీ సంగీత దర్శకుడు చక్రిని ఉద్దేశించినదనే అందరూ భావించారు.అయితే 'కింగ్‌' దర్శకుడు శ్రీను వైట్ల వాటిని ఖండించారు. నిన్న(శుక్రవారం) ఆయన హైదరాబాద్‌లో మీడీయాతో మాట్లాడుతూ ''జయసూర్య పాత్రకు చక్రికి ఎలాంటి సంబంధమూ లేదు. ఆ పాత్ర కేవలం కల్పితం మాత్రమే. చక్రి నాకు సన్నిహితుడు. చాలా మంచివాడు. ఆయన్ని దృష్టిలో ఉంచుకొనే ఆ పాత్రను మలచినట్టు మీడియాలో ప్రచారం జరుగుతోంది. అందులో నిజం లేదు.ఈ విషయంమై చక్రి బాధపడ్డాడని తెలిసింది. ఆ విషయం తెలిసినప్పటి నుంచి నేను అంతకన్నా బాధపడుతున్నాను. జయసూర్య పాత్రలో కనిపించిన చెడు లక్షణాలు చక్రిలో మచ్చుకైనా లేవు.

    టీవీల్లో వచ్చే లైవ్‌షోలలో జడ్జిలు తమకు తెలిసిన జ్ఞానాన్ని ప్రదర్శించడానికి చిన్న వారిని సైతం ఏడిపించడం నాకు నచ్చలేదు. అలా అల్లుకున్న పాత్రే అది. మా రచయితల్లో ఒకరైన గోపీమోహన్‌ మస్తిష్కం నుంచి పుట్టిన పాత్ర. గోపీ మరొక దర్శకుడికి ఈ పాత్రను గురించి చెబితే వద్దన్నారట.. నా సినిమాకు సరిపోతుందని నేను పెట్టుకున్నాను'' అని పేర్కొన్నారు. అలాగే రేస్ సినిమా ట్విస్టు ఆధారంగా తాను అల్లుకున్నానన్నది నిజం కాదని ''రేస్‌ సినిమాను తను చూడనేలేదని.. చంద్రముఖి సినిమా తనకు బాగా ఇష్టం కనుకనే ఆ పేరును ప్రస్తావిస్తూనే కొన్ని సన్నివేశాలను మలచుకున్నామ''ని ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. ఈ సమావేశంలో నిర్మాత శివప్రసాద్‌రెడ్డి తనయుడు చందన్‌ కూడా పాల్గొన్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X