దేవి శ్రీ ప్రసాద్‌కి మహేష్ దెబ్బ.. ఆ బిగ్ బడ్జెట్ సినిమాను కూడా లాగేసుకున్న థమన్!

ఏ రంగంలో అయినా పోటీ అనేది ఉంటుంది. ఇక సినిమా ఇండస్ట్రీలో అయితే ఆ డోస్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. తేడా వస్తే తెలియకుండానే ఒకరి క్రేజ్ వల్ల మరొకరి కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇక ప్రస్తుతం మ్యూజిక్ డైరెక్టర్ పోటీలలో దేవి శ్రీ ప్రసాద్ కి థమన్ కి తీవ్ర స్థాయిలో కంటికి కనిపించని యుద్ధమే జరుగుతోంది. ఇటీవల ఒక స్టార్ హీరో ఆఫర్ ని కూడా డిఎస్పీ థమన్ వల్ల మిస్ చేసుకున్నాడట.

 రాక్ స్టార్..

రాక్ స్టార్..

రాక్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దేవి శ్రీ ప్రసాద్ గత 20 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి దేవి శ్రీ ప్రసాద్ పెద్దగా డౌన్ అయ్యింది లేదు. చిన్న సినిమాలకైనా పెద్ద సినిమాలకైనా మంచి మ్యూజిక్ ని అందించి సక్సెస్ లో కీలకపాత్ర పోషించేవాడు. కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు.

 పట్టించుకోవడం లేదు..

పట్టించుకోవడం లేదు..

గత కొంత కాలంగా దేవి శ్రీ ప్రసాద్ అందిస్తున్న మ్యూజిక్ పై విమర్శలు వస్తున్నాయి. ట్యూన్స్ కొత్తగా ఏమి లేవని చాలా రొటీన్ గా ఉన్నాయని ఆడియెన్స్ నుంచి ట్రోల్స్ ఎక్కువగా వస్తున్నాయి. అవకాశాలు కూడా తగ్గుతున్నాయి. దేవి రొటీన్ ట్యూన్స్ థమన్ కి బాగా కలిసొచ్చింది. అతని సినిమాల మ్యూజిక్ సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తుండడంతో హీరోలు దేవిని పట్టించుకోవడం లేదు.

మహేష్ దెబ్బ..

మహేష్ దెబ్బ..

ఇకపోతే రీసెంట్ గా మహేష్ బాబు కూడా దేవి శ్రీ ప్రసాద్ ని కాదని థమన్ ని సెలెక్ట్ చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. సంక్రాంతికి వచ్చిన అల..వైకుంఠపురములో సినిమా విజయంలో మ్యూజిక్ కీలకపాత్ర పోషించింది. ఇక సరిలేరు నీకెవ్వరు మాత్రం అనుకున్నంతగా సక్సెస్ అవ్వలేదు. మ్యూజిక్ కూడా ఏ మాత్రం వర్కౌట్ కాలేదనే కామెంట్స్ వచ్చాయి.

Recommended Video

Sri Reddy On Balakrishna-Nagababu Issue || ఆయన కింగే మీరే బొంగు... నగ్న సత్యం చెప్పిన శ్రీ రెడ్డి
అందుకే ఆ సినిమా మిస్..

అందుకే ఆ సినిమా మిస్..

అసలైతే మహేష్ సర్కారు వారి పాటకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాల్సింది అని నిర్మాతలు అనుకున్నారు. కానీ దేవి గత సినిమాలకు అనుకున్నంతగా మ్యూజిక్ ఇవ్వకపోవడంతో మహేష్ ఒప్పుకోలేదట. ఫామ్ లో ఉన్న థమన్ ని సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే దర్శకుడు పరశురామ్ గీత గోవిందం మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ ని సజెస్ట్ చేసినప్పటికీ మహేష్ ఒప్పుకోలేదట. థమనే కావాలని పట్టుబట్టి అందరిని ఒప్పించినట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X