‘మహర్షి’ ప్రీరిలీజ్ ఈవెంట్: క్లైమాక్స్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ ఏడ్చేస్తారన్న దేవిశ్రీ ప్రసాద్!

సూపర్‌స్టార్ మహేష్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతి మూవీస్, పి.వి.పి సినిమా పతాకాలపై హై రూపొందుతోన్న భారీ చిత్రం 'మహర్షి'. మహేష్‌కు ఇది 25వ చిత్రం. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఆడియోకు మంచి స్పందన వచ్చింది.

మే 9న ప్రపంచవ్యాప్తంగా 'మహర్షి' చిత్రం విడుదలువుతున్న నేపథ్యంలో బుధవారం(మే 1) నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు భారీ సంఖ్యలో అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ... ''మహేష్ బాబు సినిమా అంటే చాలా ఎగ్జైటెడ్‌గా ఉంటుంది. ఎందుకంటే ఆయన కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న చిత్రాలు సెలక్ట్ చేసుకుంటారు. వర్క్ చేసే ప్రతి టెక్నీషియన్‌కు అది మూవీ అని మాత్రమే కాకుండా ఒక బాధ్యతగా అనిపిస్తుంది. 'మహర్షి' గ్రేట్ జర్నీ. ఈ సినిమాకు మొదట థాంక్స్ చెప్పాల్సింది వంశీ పైడిపల్లిగారికి. కథ చెప్పినపుడు డిఫరెంట్ ఎమోషన్స్‌కు లోనయ్యాను. కొన్ని సందర్భాల్లో ఏడ్చేశాను. అంత టచింగ్‌గా ఉంటుంది. ఒక మ్యూజిక్ డైరెక్టర్‌గా కాకుండా ఈ సినిమాను మీ అందరి కంటే ముందు సినిమా చూసిన ఒక ఆడియన్‌గా చెబుతున్నాను. ఈ సినిమా మొత్తం ఒక ఎత్తయితే.. క్లైమాక్స్ ఒక ఎత్తు. క్లైమాక్స్ చూసిన తర్వాత కళ్లు తడవకుండా బయటకురారు.'' అన్నారు.

Music director Devi Sri Prasad speech at Maharshi Pre Release Function

''రీరికార్డింగ్ తర్వాత సినిమా చూశాక థ్రిల్ అయ్యాం. సర్‌ప్రైజ్ అయ్యాం. ఒక రకమైన ఎమోషన్‌కు లోనయ్యాం. మాటలు రాని మౌనం మమ్మల్ని ఆవహించింది. రేపు మీరు కూడా అలాగే ఫీలవుతారు. మహేష్ గారు, వంశీ పైడిపల్లి సినిమా రేపు తెరపై అద్భుతంగా ఉంటుంది. ఇందులో అల్లరి నరేష్ గారి క్యారెక్టర్ చూసి చాలా థ్రిల్లయ్యాను. అలాంటి ఆలోచన దర్శకుడికి ఎలా వచ్చిందో అర్థం కాలేదు. నరేష్ గారు ఆ పాత్రకు పర్ఫెక్టుగా సరిపోయారు. తన నటనతో చంపేశారు.'' అని చెప్పుకొచ్చారు.

సూపర్‌స్టార్ మహేష్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతి మూవీస్, పి.వి.పి సినిమా పతాకాలపై హై రూపొందుతోన్న భారీ చిత్రం 'మహర్షి'. సూపర్‌స్టార్ మహేష్‌కు ఇది 25వ చిత్రం. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఆడియోకు మంచి స్పందన వచ్చింది. మే 9న ప్రపంచవ్యాప్తంగా 'మహర్షి' చిత్రం విడుదలువుతున్న నేపథ్యంలో బుధవారం(మే 1) నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు భారీ సంఖ్యలో అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X