Don't Miss!
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- News పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలుపు కష్టమే ... ప్రముఖ నిర్మాత షాకింగ్ కామెంట్స్
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Sports IPL 2024: హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీనే ముంబై ఇండియన్స్ కొంపముంచింది: క్రీడా మంత్రి
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
భార్యను వదిలేసి యువ గాయనితో అఫైర్.. మ్యూజిక్ డైరెక్టర్ సరికొత్త ప్రేమాయణం
మలయాళం సినిమాలతో సంగీత దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు గోపి సుందర్. చాలా కష్టపడి తెలుగులో కూడా తన టాలెంట్ ని నిరూపించుకున్నాడు. అయితే చాలా రోజుల తరువాత ఈ సంగీత దర్శకుడి ప్రేమాయణం గురించి వార్తలు వస్తున్నాయి. కుటుంబాన్ని వదిలి ఒక యువ గాయనితో డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వచ్చాయి. ఆ రూమర్స్ పై గోపి సుందర్ కూడా క్లారిటీ ఇచ్చాడు.
బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్..
మలయాళం సినిమాలతో కెరీర్ ని స్టార్ట్ చేసిన గోపి సుందర్ ఆ తరువాత హిందీ, తమిళ్, తెలుగు ఇలా అన్ని భాషల్లో తన ట్యూన్స్ ని అందిస్తూ ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్నాడు. తెలుగులో అయితే ఎక్కువగా గోపి సుందర్ మెలోడీస్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన గోపి తక్కువ కాలంలోనే ఆడియెన్స్ ని తన మ్యూజిక్ తో ఎట్రాక్ట్ చేశాడు.
భార్యతో విబేధాలు..
తెలుగులో బాక్సాఫీస్ కథలకు మ్యూజిక్ అందించిన గోపి సుందర్ వివాదాల గురించి తెలుగు ఆడియెన్స్ కి ఎక్కువగా తెలియదు. అతను తన భార్యకు దూరంగా ఉంటున్నాడని రూమర్స్ వచ్చిన తరువాత అది నిజమేనని తెలిసింది. అందుకు కారణం ఒక యువ గాయని అని టాక్ కూడా వచ్చింది. ఈ విషయంలో ఇప్పుడు తెలుగు జనాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది.
విడాకులు..
ప్రియ అనే అమ్మయిని పెళ్లి చేసుకున్న కొన్నాళ్లకు గోపి సుందర్ కి ఆమెతో విబేధాలు తలెత్తినట్లు తెలుస్తోంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఆ మధ్య గోపిసుందర్ తన భార్యకు విడాకులు ఇవ్వడానికి కోర్టును ఆశ్రయించాడు. అందుకు భార్య కూడా అంగీకరించారు. ఆ కేసు విషయంపై ఇంకా విచారణ జరగాల్సి ఉంది. ఈ వార్త మలయాళం సినీ ఆడియెన్స్ ని అప్పట్లో షాక్ కి గురి చేసింది.
Recommended Video
ఆ గాయనితో మరో పెళ్లి..
భార్యకి విడకులు ఇవ్వడానికి సిద్ధమైన గోపి సుందర్ యువ సింగర్ అభయ హిరణ్మయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. ఈ విషయాలపై పలు రూమర్లు వస్తున్న తరుణంలో ఈ సంగీత దర్శకుడు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం తన మొదటి భార్య విడాకుల కేసు కోర్టులో పెండింగ్ లో ఉందని ప్రస్తుతం తాను అభయతో ప్రేమలో ఉన్నట్లు చెప్పాడు. దీంతో మలయాళం జనాలకు ఈ విషయంపై ఫైనల్ క్లారిటీ వచ్చింది.