5 కోట్లు కట్టండి.. మైత్రీకి ఇళయరాజా లీగల్ నోటీసులు

లెజెండరీ సంగీత దర్శకుడు ఇళయరాజా మరోసారి తాజాగా లీగల్ నోటీసులను తయారు చేయించారు. గతంలో పలు చిత్రాల్లో తన సంగీతాన్ని, మ్యూజిక్ ను ఎలాంటి అనుమతి లేకుండా వాడుకున్నారని ఆయా నిర్మాతలు, సంగీత దర్శకులు, సింగర్లకు నోటీసకులు జారీ చేశారు. ఇక తాజాగా మాత్రం అల్లు అర్జున్ తో 'పుష్ప' చిత్రాన్ని నిర్మించిన చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ కు లీగల్ నోటీసులను పంపించారు. ఎందుకు? ఏంటనే విషయాలను తెలుసుకుందాం.

టాలీవుడ్ లో అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ అయిన మైత్రీ మూవీ మేకర్స్ వారు తాజాగా 'గుడ్ బ్యాడ్ అగ్లీ' అనే చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ ప్రధాన పాత్రలో పోషించగా.. స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ ఫీమేల్ లీడ్ లో నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 10న గ్రాండ్ గా విడుదలైంది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఏకకాలంలోనే పెద్ద ఎత్తున విడులైంది. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద కూడా జోరుగా వసూళ్లు రాబడుతోంది.

Music Director Ilayaraja Demands 5 Crores

ఇక గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రానికి టాప్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఆయన అందించిన పాటలకు మంచి రెస్పాన్స్ సొంతం అయ్యింది. సినిమాపై రీచ్ ను కూడా పెంచింది. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో దుమ్ములేపుతున్న క్రమంలో ఊహించని షాక్ తగిలింది. అది కూడా లెజెండరీ సంగీత దర్శకుడు ఇళయరాజా నుంచి లీగల్ నోటీసుల రూపంలో ఎదురుదెబ్బ పడింది. తాజాగా ఇళయారాజా మైత్రీ మూవీ మేకర్స్ కు లీగల్ నోటీసులు అందించడం హాట్ టాపిక్ గ్గా మారింది.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో నిర్మించిన గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలో తనకు సంబంధించిన 3 పాటలను వినియోగించారని ఆరోపించారు. అందుకు గాను పరిహరంగా రూ.5 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. వెంటనే ఆ పాటలను సినిమా నుంచి తొలగించి తనకు భేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తన అనుమతి లేకుండా తన పాటలను వినియోగించినందుకు గాను 7 రోజుల్లో తనను క్షమాపణలు కోరాలని చిత్ర బృందానికి సూచించారు. లేదంటే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుతం ఇళయ రాజా పంపించిన నోటీసులు టాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గ్గా మారాయి.

మరోవైపు, ఇళయరాజా పంపించిన లీగల్ నోటీసులకు మైత్రీ మూవీ మేకర్స్ వారు కూడా స్పందించారు. ముందుగానే సంబంధిత మ్యూజిక్ కంపెనీ నుంచి అనుమతులు పొందాని తెలియజేశారు. కానీ ఇళయరాజా దానికి ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. ఇక గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతోంది. కేవలం ఐదు రోజుల్లోనే ఈ చిత్రం రూ.171 కోట్ల వరకు వరల్డ్ వైడ్ గా గ్రాస్ వసూళ్లను సాధించింది. మొదటి వారం పూర్తి అయ్యే వరకు రూ.200 కోట్ల క్లబ్ లోనూ చేరే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X