Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
మెగాస్టార్ చిరంజీవిని చూడగానే కాళ్ల మీద పడిపోయిన బేబీ, భావోద్వేగం
సోషల్ మీడియా పుణ్యమా అని అప్పుడప్పుడు కొన్ని మంచి పనులు కూడా జరుగుతున్నాయి. ఎంతో టాలెంట్ ఉండి దాన్ని ఉపయోగించుకోలేని ఎంతో మంది మట్టిలో మాణిక్యాలు వెలుగులోకి వస్తున్నారు. ఇటీవల బేబీ అనే ఒక లేడీ సింగర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.
పొలం పనులు చేసుకుంటూ జీవించే తూర్పుగోదావరి జిల్లా వడిసెలేరు గ్రామానికి చెందిన 40 సంవత్సరాల బేబీకి అద్భుతమైన సింగింగ్ టాలెంట్ ఉన్న విషయం... వీడియో వైరల్ అయ్యే వరకు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలియదు. ఏఆర్ రెహమాన్ ఆమె వీడియో షేర్ చేయడంతో విషయం అందరికీ తెలిసింది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సంగీత దర్శకుడు కోటి ద్వారా ఆమెను తన ఇంటికి పిలిపించి అభినందించారు.
చిరంజీవిని చూడగానే బేబీ భావోద్వేగం
చిరంజీవిని చూడగానే బేబీ భావోద్వేగానికి గురయ్యారు. వెంటనే ఆయన కాళ్ల మీద పడిపోయి... ఈ జీవితానికి ఇంతకు మించి ఏమీ అవసరం లేదు. ఈ జన్మకు చచ్చిపోయినా ఫర్వాలేదు అంటూ ఎమోషనల్ అయ్యారు.
మీరు మట్టిలో మాణిక్యం: చిరంజీవి
దేవుడు మిమ్మల్ని దీవించాలి, మీరు అద్భుతమైన వ్యక్తి, అరుదైన కళ మీలో ఉంది... ఈ పరిశ్రమలో మీరు మంచి స్థానం ఏర్పరచుకోవాలి, మీరు మట్టిలో మాణిక్యం లాంటి వారు.... అంటూ చిరంజీవి బేబీపై ప్రశంసల వర్షం కురిపించారు.
మా ఆవిడ సురేఖ వల్లే మీ గురించి తెలిసింది
మా మిసెస్ సురేఖ మీ వీడియో ఎక్కడో చూసి నాకు చెప్పింది. మీరు పాట పాడిన వీడియో చూసి నేను కూడా ఆశ్చర్య పోయాను. మీలాంటి ప్రతిభ ఉన్న వ్యక్తులు ఈ పరిశ్రమకు ఎంతో అవసరం అని చిరంజీవి చెప్పుకొచ్చారు.
ఎంతో అదృష్టం ఉంటే మీ లాంటి టాలెంట్
సంగీతం నేర్చుకోలేదు, గమకాలు, స్వరాలు ఇవన్నీ మీకు తెలియకున్నా.... మీరు సహజ సిద్ధంగా అవన్నీ పలకడం ఎంతో అద్భుతంగా ఉంది. ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఇలాంటి టాలెంట్ దక్కదు. మీరు సహజ గాయిని అంటూ చిరంజీవి ప్రశంసించారు.
మీకు ఇండస్ట్రీలో మంచి భవిష్యత్ ఉంటుంది
కోటి లాంటి సోదరుడు మీకు అండగా నిలవడటం, ఫిల్మ్ ఇండస్ట్రీకి గొప్పగా వెల్ కం చెప్పడం ఆనందంగా ఉంది. మీకు మంచి భవిష్యత్ ఉండాలి, ఉంటుందని ఆశిస్తున్నాను... అని మెగాస్టార్ భరోసా ఇచ్చారు.
పొలం పనులకు వెళుతూ పాటలు
చిన్నప్పటి నుంచి పాటల మీద ఆసక్తి. మీ సినిమాలు బాగా చూసేవారం. పొలం పనులకు వెళ్లినపుడు పాట పాడుతూ పని చేసేదాన్ని... అని బేబీ చెప్పుకొచ్చారు.
ఒక్కసారి విని అద్భుతంగా పాడేస్తున్నారు
కోటి మాట్లాడుతూ.... ఇలాంటి టాలెంట్ ఉన్న వారిని ఎక్కడా చూడలేదు. ఆమె సంగీతం నేర్చుకోలేదు. అయినా ఒక్కసారి పాట వింటే లిరిక్స్, శృతి ఏ మాత్రం తప్పకుండా పాడుతున్నారు... అంటూ కోటి ప్రశంసించారు.