twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రియాలిటీ షోలో మట్టిలో మాణిక్యం.. ఒక్క పాట దెబ్బకి ఊరికి బస్సు.. అసలేం జరిగిందో వెల్లడించిన కోటి

    |

    తెలుగు టెలివిజన్లో ఎన్నో కార్యక్రమాలు ప్రసారం అవుతూ ప్రేక్షకులను తమదైన శైలిలో సందడి చేస్తున్నా కొన్ని మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటాయి.ఈ క్రమంలో జీ తెలుగులో సరిగమప సింగింగ్ కాంపిటీషన్ కార్యక్రమం కూడా విపరీతమైన ఆదరణ పొందింది. ఈ కార్యక్రమం ద్వారా ఎందరిలో మట్టిలో మాణిక్యాలు గొప్ప గాయని గాయకులుగా ఈ ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. గత సీజన్లో యశస్వి కొండేపూడి అలా హైలైట్ అవగా తాజా సీజన్లో చాలా మంది హైలైట్ అయ్యారు. అలా ఒక అమ్మాయి తన ఊరికి బస్సు రప్పించిన అంశం హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

    కోరికను నెరవేర్చిన ఏపీ ప్రభుత్వం

    కోరికను నెరవేర్చిన ఏపీ ప్రభుత్వం


    కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం లక్కసాగరానికి చెందిన దాసరి పార్వతి జీ తెలుగులో ప్రసారం అవుతున్న సరిగమప పాటల కార్యక్రమంలో ‘ఊరంతా వెన్నెల.. మనసంతా చీకటి' అనే పాటతో తన గొంతు వినిపించి జడ్జీల మనసు గెలుచుకుంది. ఆమె సహజమైన గాత్రానికి ముగ్ధుడైన సంగీత దర్శకుడు కోటి.. నీకేం కావాలమ్మా అని అడగగా నాకేం వద్దు సార్.. మా ఊరికి బస్సు వస్తే చాలని చెప్పింది. అయితే ఆమె నిస్వార్ధంగా ఒక కోరిక కోరింది కానీ దానిని తీర్చడం మామూలు విషయం కాదు. కానీ ఆమె కోరికను ఏపీ ప్రభుత్వం నెరవేర్చింది.

    బంగారం అడుగుతుందని అనుకుంటే

    బంగారం అడుగుతుందని అనుకుంటే

    అది కూడా ఒక వారంలో ఆమె ఊరికి బస్సు రావడం అంటే మాటలు కాదు. ఈ విషయం మీద తాజాగా కోటి స్పందించారు. తానూ ఆడపిల్లల్ని బాగా ఎంకరేజ్ చేస్తుంటానని అందుకే వాళ్లని ఏం కావాలమ్మా అని అడుగుతా.. సరిగమపలో పార్వతిని కూడా అదే అడిగా అని అన్నారు. అలా చాలా సందర్భాల్లో నేను అలా అడిగినప్పుడు చాలామంది గోల్డ్ కావాలని అడుగుతారని, గాజులో, చైనో, వంకీలో ఇలా చాలా ఇచ్చానని ఆయన అన్నారు.

    ఆ అలవాటు ప్రకారం

    ఆ అలవాటు ప్రకారం

    నాకు వాళ్ల పాట బాగా నచ్చిందంటే.. ఏం కావాలని అడగడం నాకు అలవాటు. ఆ అలవాటులో భాగం గానే పార్వతిని కూడా ఏం కావాలమ్మా అని అడగా.. ఆమె ఇవేమీ కోరుకోలేదు.. మా ఊరికి బస్సు కావాలని అడిగింది. ఆ మాటతో మేమంతా షాక్ అయిపోయాం. ఎందుకు అని అడిగినప్పుడు బస్సు లేక ఆమె ఎంత కష్టపడింది.. ఆ ఊరు వాళ్ళు ఎంత కష్ట పడుతున్నారు అని చెప్పడంతో మనసు కరిగిపోయింది. ఎలా అయినా ఆమె కోరిక తీర్చాలని ఫిక్స్ అయ్యానని అన్నారు.

     వెంటనే రియాక్ట్ అయ్యి

    వెంటనే రియాక్ట్ అయ్యి

    స్మిత వెంటనే రియాక్ట్ అయ్యిందని, . ఇష్యూని ఆమె చాలా సీరియస్‌గా తీసుకుందని అన్నారు. అప్పటికే నేను మంత్రి బొత్ససత్యనారాయణ గారితో ఈ బస్సు గురించి మాట్లాడాను. తణుకు ఎమ్మెల్యే కానుమూరి నాగేశ్వరరావుగారితో చెప్పి ఎలాగైనా బస్సు రప్పిందాం అని మాట్లాడామని అయితే ఇంతలో సింగర్ స్మిత మంత్రి పేర్ని నానితో మాట్లాడడంతో ఆయన చాలా బాగా స్పందించారని అన్నారు.

    Recommended Video

    Music Director Koti About Emi Bathuku Emi Bathuku Song From 1997 Movie
    ఎంత గౌరవం

    ఎంత గౌరవం

    కళాకారులకు ప్రభుత్వం ఎంత గౌరవం ఇస్తుందని చెప్పడానికి ఇదొక్కటి చాలని కోటి అన్నారు. తాను పొలిటికల్‌గా మాట్లాడటం లేదు.. ఒక చిన్నపిల్ల.. మట్టిలో మాణిక్యం లాంటి అమ్మాయి.. తన స్వార్ధానికి అడగకుండా తన ఊరికోసం ఆలోచించిందని ఆ విషయం తనకు బాగా నచ్చేసిందని అన్నారు. పేర్ని నాని వెంటనే ఆన్ లైన్‌లోకి వచ్చి మాతో మాట్లాడారని, ప్రతిరోజు కష్టం కానీ.. వారానికి రెండు మూడు సార్లు వస్తుందని చెప్పి ఆర్డర్స్ విడుదల చేశారు. కళాకారులకు ఉండే వాల్యూ అది' అంటూ కోటి వెల్లడించారు.

    Read more about: koti
    English summary
    music director koti reveals how they got bus to parvathi's village
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X