twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'రామ్మా చిలకమ్మా' పాట విషయంలో వివాదం, అదే గొడవ 'చిరుత'లో కూడా.. చిరు డాన్స్ గురించి మణిశర్మ!

    |

    టాలీవుడ్ నుంచి వచ్చిన గొప్ప సంగీత దర్శకులలో మణిశర్మ కూడా ఒకరు. దాదాపు మూడు దశాబ్దాలుగా ఆయన తెలుగు సినిమాకు సంగీతం అందిస్తున్నారు. టాలీవుడ్ లో చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున జెనరేషన్ తోపాటు పవన్, మహేష్, ఎన్టీఆర్ వంటి రెండవ తరం హీరోలకు కూడా మణిశర్మ అదిరిపోయే ఆల్బమ్స్ అందించారు. మణిశర్మ సంగీతం అందించిన అనేక చిత్రాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. తాజగా ఓ ఇంటర్వ్యూలో మణిశర్మ చిరంజీవితో జరిగిన ఓ ఘటన, ఆయన డాన్స్ గురించి ఆసక్తి వ్యాఖ్యలు చేశారు.

    రామ్మా చిలకమ్మా సాంగ్ వివాదం

    రామ్మా చిలకమ్మా సాంగ్ వివాదం

    మణిశర్మ మాట్లాడుతూ.. చూడాలని ఉంది చిత్రంలో రామ్మా చిలకమ్మా అనే సాంగ్ ని తొలిసారి ఉదిత్ నారాయణ్ తో పాడించా. ఇదేంటి రొంపు వాయిస్ లా ఉంది నాకు వద్దు అని చిరు అన్నారు. కానీ నాకు మాత్రం ఆ సాంగ్ కి ఉదిత్ వాయిసే కరెక్ట్ అనిపించింది.

    వేరే సింగర్‌తో

    వేరే సింగర్‌తో

    చిరుకి నచ్చకపోవడంతో వేరే సింగర్ తో పాడించాం. షూటింగ్ జరుగుతున్న సమయంలో అందరి అభిప్రాయాలు సేకరించడానికి ఓటింగ్ పెట్టాం. అందరూ ఉదిత్ నారాయణ్ వాయిస్ ఆ సాంగ్ కు బావుందని అన్నారు. రామ్మా చిలకమ్మా సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే.

    చిరు మెచ్చుకున్నారు

    చిరు మెచ్చుకున్నారు

    తన జడ్జిమెంట్ కరెక్ట్ కావడంతో చిరంజీవి ఆ తరువాత తనని మెచ్చుకున్నారని మణిశర్మ తెలిపారు. కోల్ కతాలో జరిగే ఫెస్టివల్ ఫెస్టివల్ ఫ్లేవర్ తో ఆ సాంగ్ చేసినట్లు మణిశర్మ తెలిపారు.

    చిరంజీవి డాన్స్ వలనే

    చిరంజీవి డాన్స్ వలనే

    చిరంజీవి స్క్రీన్ ప్రజెన్స్, డాన్స్ వలన తన మ్యూజిక్ 100 రేట్లు ఇంకా సూపర్ హిట్ అయిందని మణిశర్మ తెలిపాడు. చిన్న చిన్న జడ్జిమెంట్ లోపాలు సహజం అని మణిశర్మ తెలిపారు.

     అలాంటి ఘటనే చిరుత సినిమాలో

    అలాంటి ఘటనే చిరుత సినిమాలో

    చూడాలని ఉంది తరహాలోనే చిరుత సినిమాలో కూడా ఓ వివాదం చోటు చేసుకుందని మణిశర్మ తెలిపారు. 'ఓసోసి రాకాసి' అనే సాంగ్ చేశాం. ఆ సాంగ్ దర్శకుడికి నచ్చింది. కానీ మిగిలిన వాళ్ళెవరికీ నచ్చలేదు. దీనితో దర్శకుడు కూడా మార్చమని కోరారు. నేను మాత్రం ఈ సాంగే బావుందని నా నిర్ణయానికే కట్టుబడి ఉన్నా.

     ఎందుకు అంత పట్టుదల

    ఎందుకు అంత పట్టుదల

    చిరు కూడా ఎందుకు అంత పట్టుదల వేరే సాంగ్ చేయవచ్చు కదా అని అన్నారు. నా నిర్ణయాన్ని ధైర్యంగా చెప్పాను. ఆడియో విడుదలయ్యాక ఆ పాటె సూపర్ హిట్ అయిందని మణిశర్మ అన్నారు.

    ఖుషి సినిమా సాంగ్స్

    ఖుషి సినిమా సాంగ్స్

    ఖుషి చిత్రంలోని సాంగ్స్ చిరంజీవి బాడీ లాంగ్వేజ్ కు సరిపోవు. మహేష్ కు చేసిన సాంగ్స్ మరో హీరోకి సరిపోవు. ఎవరికి ఎలాంటి సాంగ్స్ అందించాలో గుర్తించగలగడమే సంగీత దర్శకుడి ప్రతిభ అని మణిశర్మ అన్నారు.

     నచ్చిన సింగర్

    నచ్చిన సింగర్

    తనకు నచ్చిన సింగర్ బాలసుబ్రమణ్యం అని అన్నారు. ఆయన్ని తాను అన్నయ్య అని పిలుస్తానని మణిశర్మ తెలిపారు.

    English summary
    Music Director Mani Sharma about on Chiranjeevi Dance. He reveals an incident with Chiranjeevi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X