Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మహేష్, మణిశర్మ మధ్య క్లాష్.. తొలి సారి స్పందించిన మణిశర్మ, నా వంక కూడా చూడడం లేదు!
Recommended Video
స్వరబ్రహ్మగా పేరుగాంచిన మణిశర్మ స్టార్ హీరోలందరికీ అదిరిపోయే మ్యూజికల్ హిట్స్ అందించారు. ఆయన స్వరపరచిన పాటలు ఇప్పటికి ఎక్కడోచోట వినిపిస్తూనే ఉంటాయి. దశాబ్దకాలం పైగా టాలీవుడ్ లో మణిశర్మ తిరుగులేని సంగీత దర్శకుడిగా రాణించారు. కానీ ఇటీవల ఆయన ప్రభావం బాగా తగ్గింది. టాలీవుడ్ లో చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, మహేష్ ఇలా స్టార్ హీరోలందరికీ మణిశర్మ సూపర్ హిట్ మ్యూజిక్ ఆల్బమ్స్ అందించారు. మహేష్, తనకు మధ్య జరిగిన వివాదం గురించి మణిశర్మ తాజాగా ఓ ఇంటర్వూస్ లోఆసక్తికర విషయాలు వెల్లడించారు.
అందరికి అతడే ఫేవరేట్
ఒకప్పుడు మణిశర్మ లేకుండా టాలీవుడ్ స్టార్ హీరోలు సినిమా చేసేవారు కాదంటే అతిశయోక్తి కాదేమో. మణిశర్మ మ్యూజిక్ తోనే సినిమాలకు సగం హైప్ వచ్చేవి.
ట్రెండు మారింది
ట్రెండు మారడంతో మణిశర్మ ప్రభావం క్రమంగా టాలీవుడ్ లో తగ్గిపోయింది. తెలుగు స్టార్ హీరోలు కెరీర్ లో చెప్పుకోదగ్గ చిత్రాలకు మణిశర్మ సంగీతం అందించారు. ఠాగూర్, ఇంద్ర, నరసింహ నాయుడు, పోకిరి, ఖుషి, ప్రేమించుకుందాం రా వంటి చిత్రాలు ఎన్నో ఉన్నాయి.
మహేష్ తో గొడవ గురించి
మహేష్ కెరీర్ ఆరంభం నుంచి ఆయన సినిమాలకు సంగీతం అందించాను. మేమిద్దరం మంచి సాన్నిహిత్యంగా ఉండేవాళ్ళం. కానీ ఎక్కడో చిన్న మనస్పర్థలు వచ్చాయి. మహేష్ భాదపడ్డట్లు ఉన్నాడు. కానీ విషయం ఏంటో నాకు తెలియదు అని మణిశర్మ ఓ ఇంటర్వ్యూ లోతెలిపారు.
కలవడానికి ప్రయత్నించినా
తాను మహేష్ ని కలవడానికి ప్రయత్నించినా కుదరలేదు.. ఆ తరువాత ఎక్కడా మేము కలవలేదు అని మణిశర్మ తెలిపారు. తాను చివరగా పెద్ద హీరోలకు చేసిన చిత్రాల్లో ఖలేజా, తీన్ మార్, శక్తి చిత్రాలు ఉన్నాయి. అవి సంగీతం పరంగా మంచి విజయమే సాధించాయి. ఆ తరువాత వాళ్ళెవరూ నా వంక కూడా చూడడం లేదని మణిశర్మ తెలిపాడు.