నమ్మక ద్రోహం..మొన్న చిరంజీవి, నేడు మణిశర్మ!
ఇంట్లో దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేరంటారు. కానీ పాపం పండితే ఎంతటి వారైనా పట్టు బడాల్సిందే. చిత్ర పరిశ్రమలో ఏదైనా వివాదం జరిగిందంటే వెంటనే అంతటా పాకేస్తుంది. మొన్నటికి మొన్న మెగా స్టార్ చిరంజీవి ఇంట్లో జరిగిన దొంగతనం అందరిని షాక్ కి గురిచేసింది. సాధారణంగా దొంగతనాలు జరుగుతూనే ఉంటాయి. కానీ చిరు ఇంట్లో జరిగిన దొంగతనం వాళ్ళ పని వ్యక్తే చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అటువంటి ఘటననే ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ ఇంట్లో జరిగింది.
Recommended Video


మొన్నటికి మొన్న చిరు ఇంట్లో
చిరు ఇంట్లో పని వ్యక్తిగా గత కోనేళ్ళుగా నమ్మకంగా కొనసాగుతున్న చెన్నయ్య అనే వ్యక్తి కొంత నగదుతో పరారైన సంగతి తెలిసిందే. ఆ తరువాత అతడిని పోలీస్ లు అదుపులోకి తీసుకున్నారు.

సొంత మనిషిలా చూసుకున్నామన్న మెగాస్టార్
ఈ ఘటన తరువాత చిరు స్పదించారు. చెన్నయ్య ని సొంత మనిషిలా చూసుకున్నాం అని అన్నారు. కానీ అతడు పాడు పని చేసి నమ్మకాన్ని కోల్పోయాడని చిరు ఎమోషనల్ అయ్యారు.

తాజాగా మణిశర్మ ఆఫీస్ లో
చిరు ఇంట్లో జరిగిన ఘటన మరువక ముందే మణిశర్మ ఆఫీస్ లో భారీ చోరీ జరిగింది. ఈ ఘటన టాలీవుడ్ లో సంచలనంగా మారింది. రూ 3.5 లక్షుల నగదు మరియు బంగారు ఆభరణం దొంగిలించబడింది.

ఆఫీస్ బాయ్ పనే
ఈ చోరీ చేసింది మణిశర్మ ఆఫీస్ లో ఆఫీస్ బాయ్ గా పనిచేస్తున్న వెంకటేష్ అని తేలింది. అతడు గత 10 ఏళ్ల నుంచి మణిశర్మ ఆఫీస్ లో పనిచేస్తున్నాడట. పోలీస్ లు అనుమానంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు.

షాక్ లో మణిశర్మ
తన ఆఫీస్ లో చోరీకి పాల్పడింది ఆఫీస్ బాయ్ అని తెలుసుకున్న మణిశర్మ షాక్ కి గురయ్యాడట. గతంలో చిన్న చిన్న దొంగతనాలు జరిగినా మణిశర్మ పెద్దగా పట్టించుకోలేదట. దీనితో వెంకటేష్ అదును చూసి భారీ చోరీకి పాల్పడ్డాడని పోలీసులు మీడియాకు తెలిపారు.


Click it and Unblock the Notifications











