RRR పనులపై క్లారిటీ ఇచ్చిన కీరవాణి.. ఇక మోత మోగాల్సిందే..

ఇండియన్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ RRR కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. కరోనా వైరస్ లాక్ డౌన్ ఇబ్బందులు లేకపోయి ఉంటే ఈపాటికే సినిమాకు సంబంధించిన అనేక రకాల అప్డేట్స్ వచ్చేవి. అసలైతే ఆగస్ట్ లోనే సినిమా రెగ్యులర్ ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలని జక్కన్న ఎప్పుడో ప్లాన్ చేసుకున్నాడు. కానీ లాక్ డౌన్ వల్ల ప్లాన్ మొత్తం రివర్స్ అయ్యింది.

ఇక సినిమాను వీలైనంత త్వరగా స్టార్ట్ చేయాలని చిత్ర యూనిట్ రెడీగా ఉందని గత కొంత కాలంగా అనేక రకాల అప్డేట్స్ వస్తున్న విషయం తెలిసిందే. ఇక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతున్న తరుణంలో సినిమా సంగీత దర్శకుడు ఎమ్ఎమ్.కీరవాణి ఒక స్పెషల్ అప్డేట్ ఇచ్చారు. కొన్ని రోజుల కరోనా భారిన పడిన కీరవాణి కొడుకుతో కలిసి ప్లాస్మా డొనేట్ చేసిన విషయం తెలిసిందే. ఇక పూర్తిగా కోలుకున్న ఆయన తన రెగ్యులర్ వర్క్ తో బిజీ అవుతున్నారు.

Music director Mm keeravani about rrr works latest update

సోషల్ మీడియా ద్వారా తన ప్రాజెక్టులకు సంబంధించిన అప్డేట్స్ కూడా ఇచ్చారు. "ప్రస్తుతం రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాను. క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా.. అలాగే కె.రాఘవేంద్రరావు ప్రొడక్షన్ లో రానున్న మరో సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాను. ఇక RRR పనులు కూడా త్వరలో మళ్ళీ మొదలు కానున్నాయి" అని కీరవాణి వివరణ ఇచ్చారు.

మొత్తానికి RRRపై అప్డేట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు కీరవాణి మంచి గుడ్ న్యూస్ చెప్పారు. దీంతో పాటల మోత మోగాల్సిందే అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే క్రిష్, పవన్ కళ్యాణ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాకు కూడా ఆయనే సంగీతం అందిస్తున్నారు. ఆ సినిమాపై కూడా అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఎందుకంటే కీరవాణి మొదటిసారి పవన్ కళ్యాణ్ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X