»   » సింగర్‌గా చాన్స్ ఇప్పిస్తానంటూ మోసం: సంగీత దర్శకుడి అరెస్ట్

సింగర్‌గా చాన్స్ ఇప్పిస్తానంటూ మోసం: సంగీత దర్శకుడి అరెస్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమా రంగంలోకి రావాలని ఆశ పడే యువతను కొందరు అవకాశాల ఇప్పిస్తామంటూ మోసం చేస్తున్న ఘటనలు ఇటీవల తరచూ చూస్తూనే ఉన్నాం. తాజాగా అలాంటి ఘటన మరొకటి చోటు చేసుకుంది. సినిమాల్లో సింగర్‌గా ఛాన్స్ ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి ఒక బాలికను కిడ్నాప్ చేశాడన్న అభియోగంపై హైదరాబాద్‌కు చెందిన వర్థమాన సినీ సంగీత దర్శకుడు సాకేత్ సాయిరామ్ అలియాస్ షేక్ సయ్యద్ హుస్సేన్ ఆలీని తణుకు పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు.

కృష్ణాజిల్లా తిరువూరుకు చెందిన సాకేత్ సాయిరామ్ హైదరాబాద్‌లో ఉంటూ సినీ పరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా ట్రై చేస్తున్నాడు. ఇటీవల ఉండ్రాజవరం మండలం పాలంగిలో జరిగిన తన మిత్రుడి వివాహానికి హాజరయ్యాడు. సాయిరామ్ మరో మిత్రుడి కుమార్తె అయిన సుమారు 15 ఏళ్ల మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పకుండా సాకేత్ సాయిరామ్ తనవెంట హైదరాబాద్ తీసుకుపోయాడు.

Music director Saketh Sairam kidnaps minor girl

బాలిక ఆచూకి దొరకక పోవడంతో ఉండ్రాజవరం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ ప్రారంభించగా హైదరాబాద్‌లోని ఒక లాడ్జిలో ఆమెను కొన్నాళ్లు నిర్బంధించి అనంతరం సాయిరామ్ మిత్రుడు కిరణ్ ఇంట్లో సైతం కొన్ని రోజులు దాచిపెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న ఉండ్రాజవరం పోలీసులు సాయిరామ్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో అతను తన నేరాన్నిఒప్పుకున్నట్లు సమాచారం. తమ్మారెడ్డి భరధ్వాజ శిష్యుడిగా చెప్పుకుంటున్న సాకేత్ సాయిరామ్ ఇప్పటివరకు వివిధ భాషల్లో 17 చిత్రాలకు సంగీతాన్ని అందించినట్లు సమాచారం. తెలుగులో అతను 1940లో ఓ గ్రామం, ఉస్కో, సొంత ఊరు, పోతే పోనీ, బ‌బ్లూకి ల‌వ్ స్టోరీ, మిస్సింగ్‌, షిర్డీ జైశ్రీరామ్ చిత్రాలకు సంగీతం అందించాడు.

English summary
Music director Saketh Sairam kidnaps minor girl.
Please Wait while comments are loading...