మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్‌చంద్ర వెడ్డింగ్ రిసెప్షన్ (ఫోటోలు)
హైదరాబాద్: తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర వెడ్డింగ్ రిసెప్షన్ కార్యక్రమం హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో ఆదివారం రాత్రి సందడిగా సాగింది. ఈకార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. నవంబర్ 28న శేఖర్ చంద్ర వివాహం తన ప్రియురాలు మాధురితో విజయవాడలో జరిగింది.
వెడ్డింగ్ రిసెప్షన్‌కు ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ సి.హెచ్.రామోజీరావు, విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్, జోమిని కిరణ్, ఈనాడు ఎండీ సిహెచ్ కిరణ్, నిర్మాతలు స్రవంతి రవికిషోర్, దర్శకుడు బి గోపాల్, తమ్మారెడ్డి భరద్వాజ, ఎన్ శంకర్, నీలకంఠ, రవిబాబు, కోనేటి శ్రీను, నటులు కాశీ విశ్వనాథ్, నిఖిల్ తదితరులు హజరయ్యారు.
తెలుగులో తెరకెక్కిన నువ్విలా, అనసూయ, నచ్చావులే, అవును, మేము వయసుకువచ్చాం లాంటి చిత్రాలకు శేఖర్ చంద్ర సూపర్ హిట్ మ్యూజిక్ అందించారు. ముఖ్యంగా నచ్చావులే, నువ్విలా లాంటి చిత్రాల్లో శేఖర్ చంద్ర అందించిన మెలొడీ గీతాలు ఎంతో ఆదరణ పొందాయి.

వంశీ
ప్రముఖ తెలుగు దర్శకుడు వంశీ.... నూతన వధూవరులు శేఖర్ చంద్ర-మాధురిలలతో....

రవిబాబు
దర్శకుడు రవిబాబుతో శేఖర్ చంద్ర దంపతులు. రవిబాబు దర్శకత్వంలో శేఖర్ చంద్ర పలు చిత్రాలకు సంగీతం అందించారు.

స్రవంతి రవికిషోర్
ప్రముఖ తెలుగు నిర్మాత స్రవంతి రవి కిషోర్‌తో శేఖర్ చంద్ర దంపతులు.

ఆహుతి ప్రసాద్
తెలుగు సినిమా నటుడు ఆహుతి ప్రసాద్‌తో శేఖర్ చంద్ర దంపతులు

నిఖిల్
తెలుగు యువ నటుడు నిఖిల్ తో కలిసి సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర-మాధురి

ఎన్ శంకర్
దర్శకుడు ఎన్.శంకర్‌తో కలిసి సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర-మాధురి దంపతులు

రాజగోపాల్
విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌తో కలిసి శేఖర్ చంద్ర-మాధురి దంపతులు

బి గోపాల్
ప్రముఖ దర్శకుడు బి.గోపాల్‌తో కలిసి శేఖర్ చంద్ర-మాధురి దంపతులు

రామోజీరావు
ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుతో కలిసి శేఖర్ చంద్ర-మాధురి దంపతులు

రఘు కుంచె
సంగీత దర్శకుడు, గాయకుడు రఘు కంచెతో కలిసి శేఖర్ చంద్ర-మాధురి దంపతులు

భాస్కరభట్ల
సినీ గేయరచయిత భాస్కరభట్లతో కలిసి శేఖర్ చంద్ర-మాధురి దంపతులు


Click it and Unblock the Notifications











