For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కల్యాణ్ రామ్‌ను చూసి భయపడ్డా. ఆ విషయంతో మా నాన్న షాక్ తిన్నారు.. శేఖర్ చంద్ర

  |

  నచ్చావులే, మనసారా, నువ్విలా, కార్తికేయ, ఎక్కడికి పోతావ్ చిన్నవాడా, 118 లాంటి చిత్రాలతో ఆకట్టకొంటున్న మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర సవారి చిత్రానికి అందించిన 'నీ కన్నులు' 'ఉండిపోవా' పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్నాయి. ఇప్పటి వరకూ కేవలం మెలోడీ సాంగ్స్ మాత్రమే అందిస్తూ వచ్చిన శేఖర్ చంద్ర ఒక్కసారిగా మాస్ మ్యూజిక్ అందిస్తే ఎలా ఉంటుందో 'నీ కన్నులు' పాట నిరూపించింది.

  తాజాగా సంగీతంలో తెరకెక్కిన లేటెస్ట్ సినిమా 'వలయం' ఫిబ్రవరి 21 న విడుదల కాబోతుంది. ఈ చిత్రం నుండి ఇటీవల విడుదల చేసిన 'నిన్ను చూసాకే' అనే పాటకి కూడా మంచి స్పందన లభించింది. ఇక ఈ నేపథ్యంలో ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న శేఖర్ చంద్ర కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని పంచుకున్నాడు.

  రాహుల్ సిప్లిగంజ్ థ్యాంక్స్

  రాహుల్ సిప్లిగంజ్ థ్యాంక్స్

  చాలా హ్యాపీగా ఫీలవుతున్నానండీ. 'నచ్చావులే' సినిమా నుండీ నన్ను ఆదరిస్తూ వస్తున్నారు. ఇప్పుడు 'సవారి' పాటల్ని ఇంత పెద్ద హిట్ చేసారు. ముఖ్యంగా 'నీ కన్నులు' పాటకి వచ్చిన రెస్పాన్స్ నేను అస్సలు మర్చిపోలేను. ఇప్పటికే 10 మిలియన్ వ్యూస్ సాదించింది. ఇక సాంగ్ తో టిక్ టాక్ లో కొన్ని లక్షల వీడియో చేసారు. ఈ పాట పాడిన రాహుల్ సిప్లిగంజ్ అన్నకి థాంక్స్ అలాగే లిరిక్స్ అందించిన కాసర్ల శ్యామ్ గారికి కూడా పెద్ద థాంక్స్.

  కెరీర్ చాలా కూల్‌గా

  కెరీర్ చాలా కూల్‌గా

  సినిమా పరిశ్రమకు వచ్చి 14 ఇయర్స్ అయ్యిందండి. ఇప్పటివరకూ 32 నుండీ 35 సినిమాల వరకూ చేశాను. నా కెరీర్ చాలా కూల్ గా వెళ్తుంది. నా పాటలన్నిటికీ మంచి రెస్పాన్స్ వస్తుంది. వాటికి ఎక్కువగా టిక్ టాక్ లు కూడా చేస్తూ వైరల్ చేస్తున్నారు. లవ్ స్టొరీస్ వల్ల మంచి మెలోడీస్... ఇక థ్రిల్లర్స్ చేయడం వల్ల మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. ఇచ్చే అవకాశం ఉంటుంది. 'సవారి' మూవీ లో 'నీ కన్నులు' 'ఉండిపోవా' అలాగే '118' మూవీలో 'చందమామే', 'కార్తికేయ' లో 'ఇంతలో ఎన్నెన్ని వింతలో', 'మేం వయసుకు వచ్చాం' మూవీలో 'వెళ్ళిపోకే' .. ఈ పాటలు ఇష్టం.

  కల్యాణ్ రామ్‌ను చూసి భయపడ్డా

  కల్యాణ్ రామ్‌ను చూసి భయపడ్డా

  నేను ఇప్పటి వరకూ చేసిన పెద్ద సినిమా '118' . అందులో ఒకే ఒక్క పాట ఉంటుంది. చెప్పాలంటే అది పెద్ద ఛాలెంజ్. గుహన్ డైరెక్టర్.. కళ్యాణ్ రామ్ హీరో. కాబట్టి ఆ సినిమాలో ఉన్న ఆ ఒక్క పాటకి న్యాయం చేయగలనా అని భయం వేసింది. అందులోనూ అది థ్రిల్లర్ సినిమా. కానీ 'చందమామే' అనే పాట చాలా పెద్ద హిట్ అయ్యింది. కళ్యాణ్ రామ్ గారు నన్ను అభినందించారు. నా కెరీర్లో ఇది గుర్తుండిపోయే పాట అన్నారు. అది నా మెమొరబుల్ మూమెంట్ .

  చిన్న సినిమాలే అయినా

  చిన్న సినిమాలే అయినా

  పెద్ద సినిమాల చేయలేకపోతున్నాని కచ్చితంగా ఆ ఫీలింగ్ ఉంటుంది. అయితే నేను చేసేవి చిన్న సినిమాలు అయినప్పటికీ.. కొత్త కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు. కాబట్టి.. ఫ్రెష్ మ్యూజిక్ ఇవ్వగలుగుతున్నాను. మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. పేరు తెచ్చిపెట్టడానికి పెద్ద సినిమానే అవసరం లేదు. తాజాగా 'వలయం' సినిమాకు మ్యూజిక్ చేశాను .. ఈ 21న విడుదల కాబోతుంది. ఇక 'హుషారు' టీం వాళ్ళది.. ఓ మూవీ ఫైనల్ కావాల్సి ఉంది.

  సోషల్ మీడియాకు దూరంగా

  సోషల్ మీడియాకు దూరంగా

  సోషల్ మీడియాకు దూరంగా ఉండటానికి ప్రత్యేకమైన కారణాలు లేవు. ఎందుకో ఇప్పటి వరకూ దాని గురించి ఆలోచించలేదు.. రీసెంట్ గా రాహుల్ సిప్లిగంజ్ కూడా ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చెయ్యి అని చెప్పారు. ఇప్పటి నుండి వాటి గురించి ఆలోచిస్తాను. త్వరలోనే సోషల్ మీడియాలో ప్రవేశిస్తాను.

  Recommended Video

  Mehreen Pirzada About Kalyan Ram | Mehreen Pirzada Interview || Filmibeat Telugu
  మా నాన్న షాక్ తిన్నారు...

  మా నాన్న షాక్ తిన్నారు...

  మీ నాన్నగారు ఓ సినిమాటోగ్రఫర్.. అయితే చిన్నప్పటి నుంచి నాకు మ్యూజిక్ అంటే ఇషట్ం. నేను మ్యూజిక్ డైరెక్టర్ అవుతాను అన్నప్పుడు నాన్న షాకయ్యారు.. సినిమాటోగ్రఫి అంటే పర్వాలేదు.. కానీ మ్యూజిక్ డైరెక్టర్‌గా అంటే చాలా రిస్క్ అని చెప్పారు. కానీ కొన్ని సినిమాలు చేసాక.. వాటికి వచ్చిన రెస్పాన్స్ చూసి ఆయనకి కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది. మ్యూజిక్‌లో నాకు ఏ.ఆర్.రెహమాన్ గారు.. అలాగే కీరవాణి నాకు స్ఫూర్తి.

  English summary
  Music Director Shekhar Chandra's latest movie is Valayam. This movie is set to release on February 21st. In this occassion, He speaks to media about Valayam music.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X