రూ.30 నుంచి మొదలైన థమన్ కెరీర్.. ఇప్పుడు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

ఒక సినిమా విజయంలో మ్యూజిక్ డైరెక్టర్ పాత్ర ఏ రేంజ్ లో ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఈ రోజుల్లో సినిమాకు ప్రమోషన్ లో అతి కీలకమైన ఘట్టం సంగీతానిదే. ఒక్క పాట క్లిక్కయితే చాలు సినిమాకు ఓపెనింగ్స్ బావుంటాయి. అలా మ్యూజిక్ తో సినిమాకు హైప్ క్రియేట్ చేయగల సంగీత దర్శకుడు థమన్. ఈ రోజు థమన్ పుట్టినరోజు. సెలబ్రెటీలతో పాటు అభిమానులు కూడా థమన్ కి బెస్ట్ విషెస్ అందిస్తున్నారు. ఇక థమన్ కెరీర్ పై ఒక లుక్కేస్తే..

ఒక్కసారిగా అకాశాన్ని తాకిన క్రేజ్

ఒక్కసారిగా అకాశాన్ని తాకిన క్రేజ్

సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్స్ మధ్య పోటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో థమన్ , దేవి శ్రీ ప్రసాద్ టాప్ రేంజ్ లో ఉన్నారనే చెప్పాలి. ఎక్కువగా వీరి పాటలే వినిపిస్తున్నాయి. ఇక అల.. వైకుంఠపురములో సినిమాతో థమన్ రేంజ్ ఒక్కసారిగా అకాశాన్ని తాకింది. మిగతా టెక్నీషియన్స్ కి థమన్ గట్టి పోటీని ఇస్తున్నాడు.

13ఏళ్లకె తండ్రి మరణం

13ఏళ్లకె తండ్రి మరణం

థమన్ ఇప్పుడు పెద్డ సినిమాలకు సంగీతాన్ని అందిస్తు చాలా హ్యాపీగా కనిపిస్తున్నాడు గాని కెరీర్ మొదట్లో మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఆరేళ్ళ వయసు నుంచే తండ్రి తరహాలో డ్రమ్ములు వాయించడం మొదలు పెట్టాడు. ఇక 13ఏళ్లకు తండ్రి మరణం తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. ఆ వయసులోనే థమన్ కుటుంబ భారాన్ని తనపై వేసుకున్నాడు.

30రూపాయలతో మొదలైన కెరీర్

30రూపాయలతో మొదలైన కెరీర్

ఆరవ తరగతిలోనే చదువుకు ఎండ్ కార్డ్ పెట్టేసి తనకు ఇష్టమైన మ్యూజిక్ పైనే ఫోకస్ పెట్టాడు. మొదట మాధవపెద్ది సురేష్ వద్ద జాయిన్ అయ్యడు. ఆయన సంగీతం అందించిన భైరవ ద్వీపం సినిమాకు డ్రమ్స్ వాయించి మొదటి పారితోషకంగా 30రూపాయలను అందుకున్నాడు.

నాలుగేళ్ళలో నాలుగు వేల షోలు

నాలుగేళ్ళలో నాలుగు వేల షోలు

ఆ తరువాత థమన్ కు రాజ్ కోటి, బాలసుబ్రహ్మణ్యం, శివమణి వంటి ప్రముఖుల సపోర్ట్ తో మరిన్ని అవకాశాలు అందుకున్న థమన్ రోజుకు 3 వేల రూపాయలు అందుకునే డ్రమ్మర్ గా గుర్తింపును అందుకున్నాడు. నాలుగేళ్లలో నాలుగు వేలకు పైగా స్టేజ్ షోలు చేసిన థమన్ తీరిక లేకుండా కుటుంబం కోసం కష్టపడ్డాడు. బిజీ షెడ్యూల్ లో ఉన్న థమన్ కోసం స్టేజ్ షోల డేట్స్ మారిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఆ తరువాత రవితేజ సపోర్ట్ తో..

ఆ తరువాత రవితేజ సపోర్ట్ తో..

ఇక మణిశర్మ, కోటి వంటి వారి దగ్గర ఎక్కువ కాలం పని చేసిన థమన్ ఒక్కడు, ఖుషి వంటి సినిమా పాటల్లో తన పనికి అద్భుతమైన క్రేజ్ అందుకున్నాడు. ఇక 2008లో సింధనై సీ అనే తమిళ్ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా మారిన థమన్ ఆ తరువాత రవితేజ సపోర్ట్ తో 2009లో కిక్ సినిమాతో అవకాశం అందుకొని ఇండస్ట్రీని ఆకర్షించాడు.

Recommended Video

Thaman Vs Devi Sri Prasad : Musical Fight In Tollywood
ఇప్పుడు రెమ్యునరేషన్ ఎంతంటే..

ఇప్పుడు రెమ్యునరేషన్ ఎంతంటే..

బృందావనం, మిరపకాయ్, రగడ, దూకుడు, వంటి సినిమాలతో మరింత క్రేజ్ అందుకొని అతి తక్కువ కాలంలోనే 70కి పైగా సినిమాలకు మ్యూజిక్ అంధించాడు. ఇక ఇటీవల అల..వైకుంఠపురములో సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న థమన్ తన రెమ్యునరేషన్ కోటిన్నరకు పైగా పెంచాడు. ఈ విధంగా థమన్ కెరీర్ 30 రూపాయల నుంచి కోట్ల వరకు వచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X