50ఏళ్ళ వయసులోకి వచ్చిన తరువాత అదే నా డ్రీమ్.. అందరికి ఉచితంగా..: థమన్
టాలీవుడ్ లో గత కొంత కాలంగా థమన్ పాటలే జోరుగా వినిపిస్తున్నాయి. ఎంత తక్కువ సమయంలో అయినా ఒక మ్యూజిక్ ఆల్బమ్ సెట్ చేయగల సత్తా ఉన్న ఈ టెక్నీషియన్ అంతే స్పీడ్ గా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఇవ్వగలరు. ఈ మధ్య కాలంలో థమన్ స్పెషల్ గా నేపథ్య సంగీతం కూడా అందిస్తున్నాడు. ఇకపోతే సంగీతాన్ని అమితంగా ఇష్టపడే థమన్ 50ఏళ్ళ వయసులోకి వచ్చాక ఎలాగైనా తన డ్రీమ్ ని ఆచరణలో పెట్టాలని అనుకుంటున్నాడు.

సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి
అల.. వైకుంఠపురములో సినిమాతో థమన్ ఏ స్థాయిలో విజయాన్ని అందుకున్నాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఈ సినిమాలో అన్ని రకాల సంగీతాన్ని అందించిన థమన్ అప్పటి వరకు ఉన్న నెగిటివ్ కామెంట్స్ ని కూడా చేరిపేశాడు. పాటలన్ని కూడా యూ ట్యూబ్ లో వందల మిలియన్ల వ్యూవ్స్ తో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి.

50ఏళ్ళ వయసుకు వచ్చిన తరువాత
ఇకపోతే థమన్ తన 50 ఏళ్ళ వయసులోకి వచ్చిన తరువాత తన చిరకాల కోరికను నెరవేర్చుకోవలని అనుకుంటున్నాడట. ప్రస్తుతం థమన్ వయసు 36 ఏళ్ళు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మరో 14 ఏళ్ళ తరువాత ఒక మ్యూజిక్ స్కూల్ పెట్టాలని అనుకుంటున్నాడట.

పేద విద్యార్థుల కోసం..
అందులోనే పిల్లలు మ్యూజిక్ కి సంబంధించిన పరికరాలను అలవాటు చేసుకునేలా అలాగే మ్యూజిక్ టెక్నీక్స్, వొకల్స్ వంటి వాటిపై అవగాహన కల్పించేలా మ్యూజిక్ స్కూల్ ని స్థాపించాలని అనుకుంటున్నాడట. ఇందులో విశేషం ఏమిటంటే.. ఆ స్కూల్ లో పేద విద్యార్థులకు పూర్తిగా ఉచితంగా అడ్మిషన్లు ఉండేలా ప్లాన్ చేయాలని థమన్ అనుకుంటున్నాడట.

నెక్స్ట్ ఆ సినిమాతో..
థమన్ ఆలోచనకు అభిమానులు కూడా ఫిదా అవుతున్నారు. అతని డ్రీమ్ తప్పకుండా నెరవేరాలని కోరుకుంటున్నారు. ఇక నెక్స్ట్ ఈ సంగీత సంచలనం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ సినిమా నుంచి విడుదలైన మొదటి పాట 'మగువ మగువ'కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అలాగే మరికొన్ని సినిమాలతో కూడా థమన్ చాలా బిజీగా గడుపుతున్నాడు.


Click it and Unblock the Notifications











