Multi Starrer: బాలకృష్ణ, మహేష్ బాబు మల్టీ స్టారర్.. లీక్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్
తెలుగు చిత్ర పరిశ్రమలో గతంలో అగ్ర హీరోలు కలిసి నటించి ప్రేక్షకులను అలరించారు. ప్రజంట్ బయోపిక్‌లు, పీరియాడికల్స్ ట్రెండ్‌లో మల్టీస్టారర్‌ల హవా కాస్త తగ్గింది. మంచి కథ ఉంటే కలిసి నటించడానికి తము ఎలాంటి ఇబ్బంది లేదని మనో హీరోలు ఆల్రెడీ స్టేట్‌మెంట్ ఇచ్చేశారు కూడా. కానీ ఏ ఒక్క మల్టీస్టారర్ ప్రాజెక్ట్ కూడా అనౌన్స్ కావడం లేదు. ఇలాంటి వేళ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఇద్దరు స్టార్ హీరోల మల్టీస్టారర్ గురించి హింట్ ఇచ్చారు . ఆ వివరాల్లోకి వెళితే..
టాలీవుడ్ తొలితరం సూపర్‌స్టార్లు అయిన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ , శోభన్ బాబు, కృష్ణంరాజులు ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు. గెస్ట్ రోల్స్ వేయడానికైనా సరే వెనుకాడేవారు కాదు. అందరూ కలిసి మెలుగుతూ తెలుగు సినిమా ఎదుగుదలలో తమ వంతు పాత్ర పోషించారు. తర్వాత వచ్చిన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లు మంచి మిత్రులైనా ఎందుకో ఏ ఇద్దరూ కలిసి మల్టీస్టారర్ చేయలేదు. కథలు దొరికినా అప్పట్లో ఫ్యాన్ వార్ , ఇతరత్రా కారణాలతో వెనకడుగు వేసి ఉండొచ్చని అంటారు.

నటరత్న ఎన్టీఆర్- సూపర్‌స్టార్ కృష్ణల మధ్య మంచి అనుభవం ఉంది. అన్నగారిని స్పూర్తిగా తీసుకునే కృష్ణ సినిమాల్లోకి వచ్చి, అభిమాన నటుడితోనే కలిసి నటించారు. ఎన్టీఆర్ తర్వాత అంతటి మాస్ హీరోగానూ కృష్ణ ప్రభంజనం సృష్టించారు. వీరిద్దరి వారసులైన బాలకృష్ణ, మహేశ్‌బాబులు కూడా అన్నదమ్ముల్లాగే మెలుగుతున్నారు. అలాంటి ఈ ఇద్దరూ కలిసి నటిస్తే ఇంకేమైనా ఉందా. కానీ ఈ దృశ్యం త్వరలోనే కార్యరూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్వయంగా మ్యూజిక్ డైరెక్టర్ ఈ ప్రాజెక్ట్‌పై హింట్ ఇచ్చారు.
ప్రముఖ ఓటీటీ యాప్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఇండియన్ ఐడల్ తెలుగు మూడవ సీజన్‌కు తమన్ జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో యాంకర్ శ్రీరామచంద్ర తమన్‌ను ఓ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు. బాలయ్య, మహేశ్ ఇద్దరి సినిమాలకు ఒకేసారి మ్యూజిక్ ఇవ్వాల్సి వస్తే ఎవరి మూవీకి వర్క్ చేస్తారని ప్రశ్నించారు. దీనికి తమన్ కాస్త తెలివిగా బాలయ్య, మహేశ్ కలిసి మల్టీస్టారర్ చేస్తారని, కథ కూడా రెడీ అయ్యిందని చెప్పగా ఆడియన్స్ ఈలలు, కేకలతో గోల చేశారు.
తమన్ మాటల్లో ఎంత నిజముందో తెలియదు . ప్రస్తుతం బాలకృష్ణ- మహేశ్ బాబులు తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. రాజమౌళితో మహేశ్ నటిస్తుండటంతో ఆయన అడుగు కూడా బయటపెట్టనివ్వడు. ఈ ప్రాజెక్ట్ పూర్తి కావడానికి ఈజీగా మూడేళ్లు గడిచిపోవడం ఖాయం. ఆ తర్వాత వేరే కమిట్‌మెంట్స్ ఉండనే ఉన్నాయి. మరి బాలయ్యతో మహేశ్ మల్టీస్టారర్ అన్నది శ్రీరామచంద్ర నుంచి ఎస్కేప్ అవ్వడానికి థమన్ చెప్పాడో, లేక నిజంగానే ప్రాజెక్ట్ ఓకే అయ్యిందో అన్నది తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











