వకీబ్ సాబ్ కోసం ఫస్ట్ అనుకున్న టైటిల్ ఇదే.. సినిమాలో ఊహించని సర్‌ప్రైజ్ కూడా: థమన్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమాల్లో వకీల్ సాబ్ ఒకటి. సినిమాకు సంబంధించిన ప్రమోషన్ డోస్ ను పెంచిన చిత్ర యూనిట్ సరికొత్త విషయాలను చెబుతూ మరింత ఆసక్తిని పెంచుతోంది. సినిమా కోసం మొదట అనుకున్న టైటిల్ వకీల్ సాబ్ కాదట. ఆ విషయాన్ని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తమన్ బయటపెట్టాడు.
పొట్టి బట్టలతో టాలీవుడ్ పాపులర్ యాంకర్ ఫోటోషూట్ (ఫొటోలు)

అసలైన స్టోరీ మిస్సవ్వకుండా
పింక్ సినిమాకు రీమేక్ గా వచ్చిన వకీల్ సాబ్ పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. రీమేక్ సినిమా అయినప్పటికీ పవన్ కళ్యాణ్ మార్క్ కు తగ్గట్టుకుగానే సినిమాను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఎక్కడ కూడా అసలైన స్టోరీ మిస్సవ్వకుండా అభిమానులకు మంచి కిక్కిచ్చే కమర్షియల్ సినిమాగా డిజైన్ చేసినట్లు ప్రమోట్ చేస్తున్నారు.

వకీల్ సాబ్ కోసం.. మరో టైటిల్
గత ఏడాది రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇక మొత్తనికి అన్ని పనులను పూర్తి చేసుకొని ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రావడానికి వకీల్ సాబ్ సిద్ధమయ్యాడు. అయితే ఈ సినిమాకు మొదట వకీల్ సాబ్ టైటిల్ అని అనుకోలేదట. మరొక టైటిల్ అనుకున్నట్లు చెప్పారు.

స్పెషల్ ఇంటర్వ్యూ..
వకీల్ సాబ్ సినిమా ప్రమోషన్ లో భాగంగా దర్శకుడు వేణు శ్రీరామ్, పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి, సంగీత దర్శకుడు థమన్ ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను బయట పెట్టారు.

ఫస్ట్ అనుకున్న టైటిల్ ఇదే..
ఇక సినిమా కోసం మొదట అనుకున్న టైటిల్ ' మగువ మగువ' అని పెడితే బావుంటుందనే ఆలోచన వచ్చినట్లు చెప్పారు. ఇక ట్యాగ్ లైన్ గా ' లోకానికి తెలుసా నీ విలువ' అని సెట్ చేయాలని అనుకున్నారట. అయితే పవన్ కళ్యాణ్ క్రేజ్ కు అది అంతగా సెట్టవ్వదని.. అలాగే సినిమా కథ అందరికి చేరువయ్యేలా ఉండాలని వకీల్ సాబ్ టైటిల్ ని సెట్ చేయాలని అనుకున్నట్లు చెప్పారు.

సినిమాలో సర్ ప్రైజ్
ఇక మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ సినిమాలో ఒక సర్ ప్రైజ్ ఉన్నట్లు చెప్పారు. అయితే ఆ సర్ ప్రైజ్ ఏమిటనేది ఇప్పుడే చెప్పలేను అంటూ.. అది ఆడియెన్స్ కు మంచి థ్రిల్ ఇస్తుందని అన్నారు. దీంతో సినిమాకు సంబంధించిన రూమర్స్ ఒక్కసారిగా వైరల్ అవుతున్నాయి. ఎవరైనా స్టార్ హీరో గెస్ట్ రోల్ చేశాడా? లేక పవన్ కళ్యాణ్ మరో సాంగ్ పాడారా అనేది హాట్ టాపిక్ గా మారుతున్నాయి.


Click it and Unblock the Notifications











