ఎన్టీఆర్ అన్నయ్యతో మరో సినిమా చేస్తున్నా
ఎన్టీఆర్ అన్నయ్యతో మరో సినిమా చేయబోతున్నాను అని ఉత్సాహంగా చెప్తున్నారు బృందావనం చిత్రం మ్యూజిక్ డైరక్టర్ తమన్. ఆయన్ని తాజాగా ఓ మీడియా సంస్ధ ఇంటర్వూ చేస్తే..అందులో భాగంగా ప్రస్తుతం తను చేస్తున్న వివరాలు చేస్తూ ఇలా చెప్పుకొచ్చారు. ఆయన మాటల్లోనే... మహేష్‌బాబు-శ్రీనువైట్ల కలయికలో వస్తున్న 'దూకుడు', నాగార్జున సినిమా, రవితేజ 'మిరపకాయ్' ఉన్నాయి. ఎన్టీఆర్ అన్నయ్యతో మరో సినిమా చేస్తున్నాను. ఆ వివరాలు త్వరలోనే తెలుస్తాయి అన్నారు. ఇక బృందావనం చిత్రానికి సంగీతం అందించటానికి ప్రేరణ చెప్తూ...రెండే రెండు విషయాలు నాకు ప్రేరణ కలిగించాయి. ఒకటి ఫ్యాన్స్...రెండు డ్యాన్స్. ఎన్టీఆర్‌కున్న అభిమానుల సంఖ్య లెక్కలేనిది. వాళ్లను సంతృప్తిపరిస్తే... విజయం సాధించినట్టే. వాళ్ల ఆశలకు అనుగుణంగా పాటలు రావాలి. మరోటి నృత్యం. ఎన్టీఆర్ గొప్ప డ్యాన్సర్. ఏ పాటలకైతే అన్నయ్య దద్దరిల్లిపోయేలా డ్యాన్స్ చేస్తాడో అలాంటి పాటలే ఇవ్వాలి. ఆ రెండు విషయాల్లోనూ నేను విజయం సాధించానని అనుకుంటున్నాను. 'బృందావనం' పాటలకు వస్తున్న స్పందనే అందుకు నిదర్శనం అన్నారు. ఇంతకీ ఎన్టీఆర్ తన తదుపరి ఏ చిత్రానికి తమన్ ని తీసుకుంటాడంటారు.


Click it and Unblock the Notifications











