సర్కారు వారి పాట లీక్స్.. వాడు ఇంత పని చేస్తాడు అనుకోలేదు.. ఆ బాధేమిటో తెలియాలి: థమన్
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమాపై అభిమానుల్లో అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ కూడా సోషల్ మీడియాలో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తున్నాయి. అయితే ఇటీవలే ఈ సినిమా లోని ఒక పాట లిరికల్ వీడియో ను విడుదల చేయనున్నట్లుగా ఎంతగానో బజ్ క్రియేట్ చేసిన చిత్ర యూనిట్ సభ్యులకు ఒక్కసారిగా షాక్ తగిలినట్లు అయ్యింది. ముందే సినిమా వీడియో సాంగ్ ను సోషల్ మీడియాలో లీక్ చేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక ఈ విషయంపై సంగీత దర్శకుడు తమన్ చాలా ఎమోషనల్ గా స్పందించాడు.. వివరాల్లోకి వెళితే..

ప్రేక్షకులలో నమ్మకం
మహేష్ బాబు కీర్తి సురేష్ జంటగా నటించిన సర్కారు వారి పాట సినిమాపై మొదటి నుంచి కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి ఒక్క విషయం కూడా సినిమాను చాలా తొందరగా చూడాలి అని ఆ శక్తిని కూడా కలిగిస్తుంది.. గతంలో ఎప్పుడూ లేనివిధంగా మహేష్ బాబు కూడా చాలా కొత్తగా కనిపిస్తూ ఉండటం అలాగే గీత గోవిందం దర్శకుడు పరశురామ్ దర్శకత్వం వహిస్తుండడంతో తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటుందని ప్రేక్షకుల నమ్ముతున్నారు.

చాలా బాధగా ఉంది
ఇక సినిమాకు సంబంధించిన వీడియో సాంగ్ ను సోషల్ మీడియాలో ముందే లీక్ చేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక వీడియో సాంగ్ లీక్ అవ్వడం పై థమన్ ట్విట్టర్ ద్వారా ఎమోషనల్ గా స్పందించాడు.. థమన్ మాట్లాడుతూ.. ఈ విధంగా జరగడం చాలా బాధగా ఉంది. అంటే దాదాపు ఆరు నెలల పాటు ఈ పాట కోసం చిత్ర యూనిట్ సభ్యులు ఎంతో కష్టపడ్డారని ఒకరి కష్టం కాదు అని చాలామంది ఈ సినిమా కోసం చేస్తున్నారు చాలా సునాయసంగా పాటను లీక్ ఇలా చేయడం బాధను కలిగించింది.. అన్నారు.

కరోనాను లెక్క చేయకుండా
కరోనాను కూడా లెక్క చేయకుండా పాటను షూట్ చేయడం జరిగింది. అప్పట్లో షూట్ సమయంలో 8 మందికి కరోనా కూడా వచ్చింది. ఈ సినిమా కోసం నిర్మాతలు కూడా ఎంతగానో ఖర్చు చేశారు. సినిమా హీరో పై మాకు ఉన్న ప్రేమను అంతా ఈ పాటలో చూపించాలి అనుకున్నాము. పాట కోసం వరల్డ్ బెస్ట్ టెక్నాలజీని కూడా వాడడం జరిగింది.. అని థమన్ అన్నాడు

వాడికి పని ఇస్తే..
అలాంటి ఈ పాటను ఎవడో చాలా చాలా ఈజీగా..మా ప్రాణాలన్ని చాలా ఈజీగా పెట్టేశాడు. వాడికి పని ఇస్తే.. వాడు మాకు ఈ పని చేసాడు అనుకోలేదు.గుండె తరుక్కుపోతోంది. కోపంగా ఉండాలా బాధ పడలా.. అర్థం కావడం లేదు. ఇది నిజంగా హార్ట్ బ్రేకింగ్. జనరల్ గా నేను హార్ట్ బ్రేక్ అవ్వను. ఎన్నో చూశాను. నేను ఎందుకు పబ్లిక్ డొమైన్ లో ఈ ఆడియోను పెడుతున్నానో వాడికి అర్థం కావాలి.. అని థమన్ తెలియజేశాడు.
Recommended Video

ఇలాంటివి జరగకుండా..
ఈ పాట కోసం దాదాపు వెయ్యిమంది పని చేశారు. నా వల్ల కంట్రోల్ అవ్వడం లేదు. ఈ సినిమా కోసం ఎవరు మామూలుగా కష్టపడలేదు. ఇక ఈ విషయంలో ఫ్యాన్స్ కు క్షమాపణ చెబుతున్నాం. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఇంకా చాలా జాగ్రత్తలు తీసుకుంటాం అని ప్రామిస్ చేస్తున్నాము.. అని థమన్ తెలియజేశాడు.


Click it and Unblock the Notifications











