మహేష్ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన థమన్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గత ఏడాది సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక 2021 సంక్రాంతికి కూడా మరో సినిమాతో రావాలని అనుకున్నాడు. కానీ అనుకోకుండా కరోనా వల్ల మిస్ కావాల్సి వచ్చింది. చాలా మంది అగ్ర హీరోల సినిమాలు గత ఏడాదిలోనే రావాల్సి ఉండగా అనుకోకుండా కరోనా ధాటికి వాయిదా పడిన విషయం తెలిసిందే.
ఇక మహేష్ బాబు నెక్స్ట్ మరో సంక్రాంతిని టార్గెట్ చేస్తుండడంతో ఈ సారి మరో బాక్సాఫీస్ హిట్ పడటం గ్యారెంటీ అని అర్ధమవుతోంది. ఇక సర్కారు వారి పాట షూటింగ్ పై సంగీత దర్శకుడు థమన్ ఒక అప్డేట్ ఇచ్చాడు. సినిమాకు సంబంధించిన మొదటి షెడ్యూల్ పూర్తయ్యిందట. రెండువారాల పాటు దుబాయ్ లో షూటింగ్ చేసిన విషయం తెలిసిందే.

ఇక ఫైనల్ గా అనుకున్నట్లుగానే సినిమా షెడ్యూల్ ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి చేశారని థమన్ వివరణ ఇచ్చాడు. ఇక నెక్స్ట్ షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ మొత్తం హైదరాబాద్ కు రానుంది. ఇక్కడ మరో రెండు వారాల పాటు ఒక స్పెషల్ సెట్ లో కీలకమైన సన్నివేశాలను షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది. గీత గోవిందం లాంటి బాక్సాఫీస్ హిట్ అనంతరం పరశురామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక 2022 సంక్రాంతికి సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Click it and Unblock the Notifications











