పెళ్లి ఒకడితో ఫస్ట్ నైట్ ఇంకోడితో.. వాళ్ళ పరువు తీసేసిన మ్యూజిక్ డైరెక్టర్ థమన్!

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం అగ్ర సంగీతదర్శకుడిగా కొనసాగుతున్న థమన్ సినిమా సినిమాకు తన క్రేజ్ ను మరింత పెంచుకుంటున్నాడు. ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ప్రత్యేకమైన మ్యూజిక్ ను అందిస్తూ సినిమా విజయంలో కూడా చాలా కీలక పాత్ర పోషిస్తున్నాడు. అతనికి పరభాషలో నుంచి కూడా ఆఫర్స్ చాలానే వస్తున్నాయి అయితే బాలీవుడ్ లో కూడా థమన్ కొన్ని ఆఫర్స్ వచ్చాయి. కానీ అక్కడ అతనికి కొన్ని విషయాలు అంతగా నచ్చలేదు. ఇక ఎవరూ ఊహించని విధంగా వారిపై థమన్ కామెంట్ చేయడం మీడియాలో వైరల్ గా మారింది.

అఖండతో షేక్ చేసిన థమన్

అఖండతో షేక్ చేసిన థమన్

సంగీత దర్శకుడు తమన్ ఇటీవల కాలంలో ఎలాంటి సినిమా చేసినా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకుంటున్నాడు. ముఖ్యంగా అఖండ సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సినిమాకు థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు అమెరికా సౌండ్ బాక్స్ లు కూడా షేక్ అయ్యాయి.. ప్రస్తుతం తమన్ తో సినిమా చేయడానికి స్టార్ దర్శకులు హీరోలు కూడా సిద్ధంగా ఉన్నారు.

ఆలీ టాక్ షోలో..

ఆలీ టాక్ షోలో..

ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తమను ఎవరూ ఊహించని విధంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపాడు. ఆలీతో సరదాగా టాక్ షోలో పాల్గొన్న సంగీత దర్శకుడు థమన్ తన జీవితంలోనే కొన్ని విషయాలతో పాటు అలాగే విచిత్రమైన సంఘటనలు గురించి కూడా తెలియజేశాడు. బాలీవుడ్ ఇండస్ట్రీ పై ఎవరూ ఊహించని విధంగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బాలీవుడ్ లో కూడా

బాలీవుడ్ లో కూడా

ఇక థమన్ బాలీవుడ్లో కూడా కొన్ని సినిమాలు చేశాడు. గోల్ మాల్ ఎగైన్ సినిమాలో ఒక పాటతో పాటు సింబా సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అందించాడు. ఇక తర్వాత మరొక హిందీ సినిమా కూడా అదే తరహాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించాడు. అయితే ఆ విధమైన వర్క్ థమన్ కు ఏమాత్రం నచ్చలేదు. అలాంటి ఆఫర్స్ అతనికి చాలానే వస్తున్నాయట. ఇక నుంచి అలాంటి సినిమాలో వర్క్ చేయాలని అనుకోవడం లేదని థమన్ ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు.

పెళ్లి ఒకడితో.. ఫస్ట్ నైట్ ఇంకోడితో..

పెళ్లి ఒకడితో.. ఫస్ట్ నైట్ ఇంకోడితో..

ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో సగం సగం పనులు చేయడం తనకు ఏమాత్రం నచ్చలేదు అని అదేదో పెళ్లి ఒకడి తో ఫస్ట్ నైట్ ఇంకొకడితో అన్నట్లుగా ఉంది అని థమన్ ఊహించని విధంగా కామెంట్స్ చేశాడు. నేను ఏ సినిమా ఒప్పుకున్న కూడా పూర్తిస్థాయిలో దానికి పని చేయాలని అనుకుంటాను. కేవలం సాంగ్స్ మాత్రమే కాకుండా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటాను. అలా చేస్తే నాకు సంతృప్తిగా ఉంటుంది. ఇక బాలీవుడ్ వాళ్ళు సాంగ్స్ ఒకరితో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరొకరితో చేయించుకుంటున్నారు. అయితే నేను అలా చేయకూడదు అని బలంగా నిర్ణయం తీసుకున్నాను అని థమన్ తెలియజేశాడు.

థమన్ రెమ్యునరేషన్ ఎంతంటే?

థమన్ రెమ్యునరేషన్ ఎంతంటే?

ప్రస్తుతం సంగీత దర్శకుడు తమన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల అఖండ సినిమా సక్సెస్ అయిన తర్వాత థమన్ భారీ స్థాయిలో రెమ్యునేషన్ డోస్ కూడా పెంచినట్లు తెలుస్తోంది. మొన్నటి వరకు రెండున్నర కోట్ల వరకు పారితోషికం అందుకున్న ఈ సంగీత దర్శకుడు రాబోయే ఆఫర్స్ కు మూడు కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

రాబోయే సినిమాలు..

రాబోయే సినిమాలు..

ప్రస్తుతం థమన్ చేతిలో కూడా చాలా పెద్ద సినిమాలు ఉన్నాయి. భీమ్లా నాయక్ సినిమాతో పాటు గని, సర్కారు వారి పాట, అలాగే మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్, మెగా పవర్ స్టార్ 15వ సినిమాకు కూడా సంగీతం అందిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ 107వ సినిమాతో పాటు మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరపైకి రాబోయే సినిమాకు కూడా థమన్ మ్యూజిక్ ఇవ్వబోతున్నట్లు క్లారిటీ ఇచ్చేశాడు. అలాగే తమిళంలో కూడా మరొక రెండు సినిమాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X