»   » హోటల్‌ రూంలో మ్యూజిక్ డైరెక్టర్ కూతురు మృతి, ఏమైంది?

హోటల్‌ రూంలో మ్యూజిక్ డైరెక్టర్ కూతురు మృతి, ఏమైంది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: మళయాల నటి కల్పన షూటింగ్ నిమిత్తం ఇటీవల హైదరాబాద్ వచ్చి హోటల్ లో మరణించిన సంఘటన మరువక ముందే...మరో మళయాల సెలబ్రిటీ హోటల్ లో మృత్యు వాత పడ్డారు. మళయాల సీమకు చెందిన సింగర్ షాన్ జాన్సన్(29) చెన్నైలోని ఓ ప్రైవేట్ హోటల్ లో అనుమానాస్పదంగా మరణించారు. సినిమా సాంగ్స్ రికార్డింగ్ ప్రాసెస్ లో భాగంగా చెన్నై వచ్చి హోటల్ లో బస చేసిన ఆమె హఠాన్మరణం చెందారు. ఆమె ప్రముఖ మళయాల సంగీత దర్శకుడు, కీర్తి శేషులు జాన్సర్ మాస్టర్ కూతురు.

చెన్నై సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం....గురువారం సాంగ్ రికార్డింగ్ తర్వాత షాన్ జాన్సన్ తిరిగి హోటల్ కు చేరుకున్నారు. శుక్రవారం ఆమె రికార్డింగ్ పూర్తి చేసి తిరిగి ఇంటికి వెళ్లడానికి ప్లాన్ చేసుకున్నారు. అయితే ఇంతలోనే ఆమె హోటల్ లో మరణించడం అందరినీ షాక్‌కు గురి చేసింది.

అయితే షాన్ జాన్సన్ మరణానికి గల కారణాలు ఏమిటో ఇంకా తెలియలేదు. అయితే నిద్రలో గుండె పోటు రావడంతో మరణించినట్లు అనుమానిస్తున్నారు. షాన్ జాన్సర్ తండ్రి, ప్రముఖ మళయాల సంగీత దర్శకుడు, నేషనల్ అవార్డ్ విన్నర్ జాన్సర్ మాస్టర్ ఆగస్టు 2011లో మరణించారు. తర్వాత 2012లో ఆమె తన ఒక్కగానొక్క సోదరుడు రెన్ జాన్సన్ ను రోడ్డు ప్రమాదంలో పోగొట్టుకున్నారు. అప్పటి నుండి షాన్ జాన్సన్ తన తల్లి రాణి జాన్సన్ తో కలిసి ఉంటున్నారు.

తండ్రితో కలిసి

తండ్రితో కలిసి

తండ్రి జాన్సన్ మాస్టర్ తో కలిసి షాన్ జాన్సన్

ఫ్యామిలీ

ఫ్యామిలీ

జాన్ జాన్సన్ ఫ్యామిలీ...

తల్లితో..

తల్లితో..

తల్లి రాణి జాన్సన్ తో కలిసి షాన్ జాన్సన్.

చిన్నతనంలో...

చిన్నతనంలో...

చిన్నతనంలో తండ్రితో కలిసి షాన్ జాన్సన్

త్రిస్సూర్ కు తరలింపు

త్రిస్సూర్ కు తరలింపు

శవ పంచనామా పూర్తి చేసిన తర్వాత చెన్నై పోలీసులు....షాన్ భౌతిక కాయాన్ని ఆమె సొంత పట్టణం త్రిస్సూర్ కు తరలించనున్నారు.

కారణాలు?

కారణాలు?

ఆమె రమణానికి గల కారణాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

మ్యూజిక్

మ్యూజిక్

తండ్రి ద్వారా అందిపుచ్చుకున్న సంగీత కళను.... షాన్ జాన్సన్ కొనసాగిస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఆమె మ్యూజిక్ కంపోజర్ గా, సింగర్ గా యాక్టివ్ గా ఉన్నారు. మళయాలంలో పలు హిట్ చిత్రాలకు సంగీతం అందించారు.

English summary
Late veteran musician Johnson master's daughter, singer Shan Johnson was found dead at a private hotel in Chennai. The 29-year-old was staying in Chennai for recording purposes.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu