'మగధీర' పై 'ముస్లిం' ల తిరుగుబాటు

By Staff

రామ్ చరణ్, రాజమౌళిల కాంబినేషన్ లో వచ్చిన మగధీర చిత్రం ఏ రేంజ్ లో హిట్ అయిందో అదే రేంజ్ లో వివాదాల్లో చిక్కుకొంటోంది. మొన్న వంగపండు సృష్టించిన 'పాట' వివాదం సద్దుమనగక ముందే మగధీర కథ తనదేనంటూ 'చందేరి' నవల రచయిత యస్.పి.చారి ఆరోపించారు, ఈ విషయమై మగధీర చిత్ర నిర్మాత అల్లు అరవింద్ కు లీగల్ నోటీసు కూడా అందింది.

ఇక తాజా వివాదం ఏంటంటే ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ముస్లిం మతస్తుల మనోభావాలను కించపరిచేలా వున్నాయని మచిలీపట్నం, నూరుద్దీన్ పేటకు చెందిన యూనిస్ స్థానిక పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసారు. చిత్రంలోని ఓ సన్నివోశంలో షేర్ ఖాన్ (శ్రీ హరి పోషించిన పాత్ర) పాత్రధారుడు ముస్లిం మతస్తుల జెండాను అవమానించేలా వున్నాయని, మరో సన్నివేశంలో నమాజ్ లో చేసే విధంగా తన సైనికుల ముక్కుని నేలకు తాకేలా చేసారని...ఇవి ముస్లింల మనోభావాలను దెబ్బతీసేలా వున్నాయని తన పిటీషన్ లో పేర్కొన్నారు. ఈ కేసును స్థానిక జిల్లా కోర్టు సెపెంబరు 10వ తేదీకి వాయిదా వేసింది.

మొదటి రెండు వారాలలో దాదాపు 38 కోట్ల రూపాయలు వసూలు చేసి రికార్డులు సృష్టిస్తున్న మగధీర చిత్రం వివాదాల్లో కూడా సరికొత్త రికార్డులు సృష్టించేలా కనిపిస్తోంది...

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X