»   » ఉత్తమ విలన్: విహెచ్‌పి ఆందోళనకు ముస్లిం సంఘాల మద్దతు

ఉత్తమ విలన్: విహెచ్‌పి ఆందోళనకు ముస్లిం సంఘాల మద్దతు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కమల్ హాసన్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్న ‘ఉత్తమ విలన్' చిత్రం విడుదలకు ముందే ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ చిత్రంపై నిషేధం విధించాలని విశ్వహిందూ పరిషత్(వీహెచ్ పీ) తమిళనాడు వింగ్ ఆందోళన ప్రారంభించింది. ఈచిత్రంలోని సన్నివేశాలు హిందువుల మనోభావాలను కించే పరిచే అవకాశం ఉన్న కారణంగా నిలుపుదల చేయాలంటూ పోలీస్ కమిషనర్ కు వీహెచ్ పీ ఓ నివేదికను సమర్పించింది. విహెచ్‌పి చేస్తున్న ఆందోళనకు ఊహించని మద్దతు లభిస్తోంది. తమిళనాడులోని పలు ముస్లిం సంఘాలు వారి ఆందోళనకు మద్దతు పలికారు.

విష్ణుమూర్తి భక్తుడు ప్రహ్లాదనకు, హిరణ్యకశపుడు అనే రాక్షసుడికి జరిగే సంభాషణ ఆధారంగా తెరకెక్కిన ఒక పాట విష్ణుమూర్తి భక్తులను నిరాశకు గురిచే విధంగా ఉందని, మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందని హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.


 Muslim Organisation Supports VHP's Protest Against Uttama Villain

గతంలో కమల్ హాసన్ విశ్వరూపం సినిమాలో ముస్లింల మనోభావాలు దెబ్బతీసే సన్నివేశాలు పెట్టాడని, ఇపుడు ‘ఉత్తమ విలన్' చిత్రంలో హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా సన్నివేశాలు పెట్టాడని, మతపరమైన వివాదాలు సృష్టించడం ద్వారా కమల్ హాసన్ తన సినిమాకు చీప్ పబ్లిసిటీ పెంచుకుంటున్నాడని ముస్లిం సంఘాలు ఆరోపిస్తున్నాయి.


కమల్‌హాసన్‌ హీరోగా నటించిన చిత్రం 'ఉత్తమ విలన్‌'. రమేష్‌ అరవింద్‌ దర్శకత్వం వహించారు. ఇందులో కె.బాలచందర్‌ కీలకపాత్ర పోషించారు. కె.విశ్వనాథ్‌, ఆండ్రియా, పూజాకుమార్‌, నాజర్‌, ఎంఎస్‌ భాస్కర్‌ తదితరులు కూడా నటించారు. ఈ చిత్రం మే ఒకటో తేదీన విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చిత్రవర్గాలు ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. సినిమా ఈ నెలలోనే విడుదల కావాల్సి ఉండగా థియేటర్ల సమస్య, తెలుగు వెర్షన్‌ పనుల కారణంగా ఆలస్యమవుతోందని సమాచారం.


ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సమర్పణలో తిరుపతి బ్రదర్స్‌ ఫిల్మ్‌ మీడియా ప్రై.లి., రాజ్‌కమల్‌ పిల్మ్‌ ఇంటర్నేషనల్‌ పతాకాలపై రమేష్‌ అరవింద్‌ దర్శకత్వంలో తమిళంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై సి.కళ్యాణ్‌ అదే పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు.

English summary
Vishwa Hindu Parishad received unexpected support in its fight against actor Kamal Hassan's upcoming Tamil film Uttama Villain, when a Muslim organization, on April 10, lodged a police complaint seeking action against the actor for his "attempts to insult religious sentiments" of Hindus.
Please Wait while comments are loading...