ఆ సినిమాను తిప్పికొట్టండి: వర్మపై వీరప్పన్ భార్య పైర్
హైదరాబాద్: తన భర్త జీవితంపై రాంగోపాల్ వర్మ తీసిన ఈ సినిమాలో వాస్తవాలను వక్రీకరించి తీశారని వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి ఆరోపించింది. వీరప్పన్ జీవితాన్ని తప్పుగా తెరకెక్కించాడని ఆమె ఫైర్ అయ్యారు.
వీరప్పన్ పై హిందీలో సినిమా తీస్తున్నానని, అతని గురించి చెప్పమని రాంగోపాల్ వర్మ తన దగ్గరికి వచ్చాడని, తను చెప్పినదానికి, సినిమాలో చూపించిన దానికి చాలా తేడా ఉందని, పైగా వేరే భాషలో కూడా తీస్తానని చెప్పలేదని, చెప్పకుండా తీసి రిలీజ్ చేశాడని మండి పడ్డారు. వీరప్పన్ పై ఇష్టం వచ్చినట్టు కథ అల్లాడని, సినిమాలో చూపించిందంతా అబద్ధమని ఆమె తెలిపారు.

వర్మ తీసిన వీరప్పన్ చిత్రం ఇప్పటికే హిందీలో వీరప్పన్ పేరుతో రిజలీజవ్వగా... అంతకు ముందే తెలుగు, కన్నడలో కిల్లింగ్ వీరప్పన్ పేరుతో విడుదలైన సంగతి తెలిసిందే. త్వరలో ఈ చిత్రాన్ని తమిళంలో విల్లాది విల్లన్ వీరప్పన్ పేరుతో రిలీజ్ చేసారు.
తమిళ రిలీజ్ నేపథ్యంలో ముత్తు లక్ష్మి ఈ సినిమాకు నెగెటివ్ ప్రచారం మొదలు పెట్టింది. వీరప్పన్ జీవితాన్ని వర్మ పూర్తిగా వక్రీకరించిన తెరకెక్కించాడని, ఈ సినిమాను సినిమాను చూడొద్దని, సినిమాను బహిష్కరించాలని ఆమె కోరారు.


Click it and Unblock the Notifications











