విక్టరీ వెంకటేష్‌ను కెప్టెన్ చేయాలి.. జర్సీ మూవీ చాలా ఇష్టం.. ఒకసారి ఫోన్‌లో నానితో.. ముత్తయ్య మురళీధరన్

క్రికెట్ మైదానంలో బంతితో బ్యాట్స్‌మెన్లను గడగడలాడించిన ముత్తయ్య మురళీధరన్ టెస్ట్ క్రికెట్‌లో ఎవరూ అందుకోలేని విధంగా 800 వికెట్ల తీసి చరిత్ర సృష్టించాడు. అలాంటి గొప్ప స్పిన్నర్ జీవితం ఆధారంగా రూపొందిన బయోపిక్ 800 మూవీ అక్టోబర్ 6వ తేదీన రిలీజ్‌కు సిద్దమైంది. మురళీధరన్ పాత్రలో 'స్లమ్‌డాగ్ మిలియనీర్' ఫేమ్ మధుర్ మిట్టల్, మదిమలర్ పాత్రలో మహిమా నంబియార్ నటించారు. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించారు. బుకర్ ప్రైజ్ (2022) పురస్కార గ్రహీత షెహన్ కరుణతిలకతో కలిసి ఆయన స్క్రిప్ట్ అందించారు. శ్రీదేవి మూవీస్ అధినేత, ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమా విడుదల అవుతున్నది. ఈ సినిమా రిలీజ్‌కు ముందు నిర్వహిస్తున్న ప్రమోషన్స్‌లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో జరిపారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వీవీఎస్ లక్ష్మణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వీవీఎస్ లక్ష్మణ్ మాట్లాడుతూ..

ముత్తయ్య మురళీధరన్‌తో ఉన్న అనుబంధాన్ని, అనుభూతులను వీవీఎస్ లక్ష్మణ్ పంచుకొన్నారు. మైదానంలో మురళీధరన్ సాధించినది మాత్రమే కాదు, అతని జీవితమంతా స్పూర్తిదాయకం. బాల్యం నుంచి క్రికెట్ రంగం వరకు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు. క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత కూడా అందరికి స్పూర్తిని కలిగిస్తున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మురళీధరన్ మెంటార్ కూడా వ్యవహరించడం చాలా ఆనందంగా ఉంది అని వీవీఎస్ లక్ష్మణ్ చెప్పారు.

 Muttiah Muralitharan

మురళీధరన్‌తో కలిసి ఇంగ్లీష్ కౌంటీలో లాంక్‌షైర్ తరుపున క్రికెట్ ఆడాను. భారత్, శ్రీలంక జట్ల తలపడితే.. ప్రత్యర్థిగా కూడా ఆడాను. కేవలం ఆటగాడిగానే కాకుండా వ్యక్తిగతంగానూ అతనితో పరిచయం ఉంది. మురళీధరన్ గొప్ప క్రికెటర్ అని అందరికీ తెలుసు. అంత కంటే గొప్ప మనసు ఉన్న వ్యక్తి, గర్వం ఏ కోశాన కనిపించదు. ఈ తరం యువతకు, క్రికెటర్లకు రోల్ మోడల్. నాకు బ్రదర్ కంటే ఎక్కువ. అతనిలాంటి ఫ్రెండ్ ఉండటం లక్కీ. ముత్తయ్య మురళీధరన్‌కు క్రికెట్ జీవితం అని వీవీఎష్ లక్ష్మణ్ అన్నారు.

 Muttiah Muralitharan

వీవీఎస్ లక్ష్మణ్‌ను మొదటిసారి 1998లో చూశాను. ఒరిస్సాలో కటక్‌లో మ్యాచ్ ఆడుతున్నప్పుడు కలిశాం. అప్పుడు లక్ష్మణ్ నా కంటే వయసులో చిన్న. టీనేజ్ వయసులోనే తన ఆటతో అందరికి షాక్ ఇచ్చాడు. ఇలాంటి ఆటగాడు ఇండియా టీమ్‌లో ఎందుకు లేడబ్బా అనుకొన్నాను. ఆ తర్వాత చాలాసార్లు కలిశాం. స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో లక్ష్మణ్ తనకు తానే సాటి. ఢిల్లీలో మ్యాచ్ ఆడినప్పుడు అతడిని అవుట్ చేశాను. శ్రీలంకలో ఆడేటప్పుడు నా జట్టు సహచరుడు మెండీస్ వికెట్ తీసేవాడు అని ఆ రోజులను ముత్తయ్య మురళీధరన్ గుర్తు చేసుకొన్నారు.

హైదరాబాద్ అంటే నాకు చాలా స్పెషల్... హైదరాబాద్‌లో తొలిసారి వచ్చినప్పుడు ఇంత అభివృద్ది చెందలేదు. కానీ ప్రస్తుతం ఎత్తైన భవనాలు, ఐటీ కంపెనీలతో ఇండియాలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న నగరంగా మారింది. నేను ఐపీఎల్ నుంచి రిటైర్ అయ్యాక సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు పని చేయమని అడిగారు. ఒకసారి టీం అంతా హైదరాబాద్ నుంచి వేరే సిటీకి వెళుతున్నాం. నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం. బిర్యానీ తినిపిస్తావా? అని లక్ష్మణ్ అడిగితే.. అరగంటలో విమానంలో చాలా బిర్యానీలు తెప్పించి పెట్టరాు. లక్ష్మణ్ అంటే అది'' అని మురళీధరన్ చెప్పారు.

 Muttiah Muralitharan

ఇండియన్ సెలబ్రిటీలతో క్రికెట్ టీం ఏర్పాటు చేయాల్సి వస్తే... ఎవరెవరిని ఎంపిక చేస్తారని అడగ్గా ''వెంకటేష్‌ను కెప్టెన్ చేయాలి. ఆయనకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఆయన ఎప్పుడూ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ మిస్ కారు. అని మురళీధరన్ చెప్పారు. నానితో ఒకసారి మాట్లాడాను. నానీ నటించిన జెర్సీ సినిమా అంటే నాకు చాలా ఇష్టం అని ముత్తయ్య మురళీధరన్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X