హన్సికను బ్యాడ్‌గా చూపించే ప్లాన్ విఫలం!
చెన్నై: ఈ మధ్య సెలబ్రిటీల సోషల్ నెట్వర్కింగ్‌లోకి హ్యాకర్లు చొరబడటం..... కొన్ని అవాంఛనీయ సంఘటనలకు పాల్పడటం, కొన్ని సార్లు వారిని జనాల్లో బ్యాడ్‌గా చిత్రీకరించే ప్రయత్నం చేయడం తెలిసిందే. తాజాగా హన్సికపై హ్యాకర్ల కన్ను పడింది. ఆమె ట్విట్టర్ అకౌంట్లోకి హ్యాకర్లు చొరబడ్డారు. అయితే కొన్ని గంటల తర్వాత మళ్లీ ఆమె అకౌంట్ కంట్రోలోకి వచ్చింది.
ఈ విషయం గురించి హన్సిక తన ట్విట్టర్లో పేర్కొంటూ... 'నా అకౌంట్ నిన్ని రాత్రి హ్యాకింగ్ కు గురైంది. కొన్ని గంటల తర్వాత మళ్లీ నా కంట్రోల్ లోకి వచ్చింది. ఇప్పుడు ఏమీ సమస్య లేదు' అంటూ హన్సిక ట్వీట్ చేసింది. ఈ అనుభవంతో హ్యాకర్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని అందరినీ చైతన్య పరుస్తోంది హన్సిక.
గతంలో హన్సిక ఫేస్ బుక్ అకౌంట్ హ్యాకర్ల భారిన పడిన సంగతి తెలిసిందే. వారు ఆమె పాస్ వర్డ్ కూడా మార్చేసారు. హన్సిక ఫేస్ బుక్ మేనేజ్ మెంట్‌ను సంప్రదించి తన ఫేస్ బుక్ అకౌంట్ మళ్లీ తన ఆధీనంలోకి తెచ్చుకుంది.
ఇక హన్సిక సినిమాల విషయానికొస్తే...
హన్సిక ఇటీవల తెలుగులో నటించిన 'దేనికైనా రెడీ' చిత్రం మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఏకంగా ఏడు తమిళ సినిమాల్లో నటిస్తోంది. హిందీ ఢిల్లీ బెల్లి చిత్రానికి రీమేక్ గా తమిళంలో రూపొందిన 'సత్తై' చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈచిత్రం తెలుగులో 'నాటీ బాయ్స్' పేరుతో రిలీజ్ అవుతోంది. వీటితో పాటు హన్సిక వల్లు, వెట్టై మానన్, సింగ్ 2, ఇష్క్, బిర్యానీ, తీయ వేలయ్ సేయనుమ్ కుమారు అనే తమిళ చిత్రాల్లో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











