సల్మాన్ కరీనాల అక్రమసంబంధం??
నిజ జీవితంలో సైఫ్ అలీఖాన్ తో 'సహ జీవనం" సాగిస్తున్న కరీనా సినిమాలపరంగా ప్రస్తుతం సల్మాన్ ఖాన్‌తో సరసాలాడుతోంది. సల్మాన్ ఖాన్‌కు జోడీగా ఈ భామ నటిస్తున్న 'మై ఔర్ మిసెస్ ఖన్నా" చిత్రం ఈ వారంలో విడుదలకాబోతున్నది. ఈ చిత్రం 'వివాహేతర సంబంధం నేపధ్యం"లో రూపొందినట్లు సమాచారం. ఈ చిత్రం ద్వారా ప్రేమ్ ఆర్ సోని దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఇటీవల ఈ చిత్రంలోని ఓ పాటను ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరంలోని ఓ ఆకాశహర్మ్యంలో 125 వ అంతస్తు (మీరు కరెక్ట్‌గానే చదివారు నూట ఇరవై అయిదవ అంతస్తు) పై చిత్రీకరించారు.
ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్-కరీనాలపై చిత్రీకరించిన రొమాంటిక్ సన్నివేశాలు కుర్రకారుని మళ్లీ మళ్లీ థియేటర్లకు తీసుకువస్తాయని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. అయితే ఈ సినిమా వివాహేతర సంబంధం నేపథ్యంలో ఉంటుందంటూ జరుగుతున్న ప్రచారాన్ని దర్శకుడు ప్రేమ్ ఆర్ సోని తీవ్రంగా ఖండిస్తున్నారు. 'మై ఔర్ మిసెస్ ఖన్నా" ('నేనూ.. ఖన్నా భార్య") అనే పేరును బట్టి ఆ విధమైన ఊహాగానాలు చేయడం సమంజసం కాదని ఆయన చెబుతున్నారు. టైటిల్ జస్టిఫికేషన్ తెలియాలంటె సినిమా చూడాల్సిందేనని ఆయన అంటున్నారు!


Click it and Unblock the Notifications











