బ్రాహ్మణులను కించ పరచలేదు: బ్రహ్మానందం
హైదరాబాద్: మంచు విష్ణు, హన్సిక జంటగా రూపొందిన 'దేనికైనా రెడీ' సినిమాపై బ్రాహ్మణులు చేస్తున్న ఆరోపణలపై హాస్య నటుడు బ్రహ్మానందం తాజాగా స్పందించారు. 'దేనికైనా రెడీ' చిత్రంలో తాను బ్రాహ్మణులను కించ పరిచే పాత్ర చేయలేదని స్పష్టం చేసారి. ఒక వేళ నా వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే మన్నించాలని బ్రహ్మానందం కోరారు.
'దేనికైనా రెడీ' సినిమాపై కొన్ని రోజులుగా బ్రాహ్మణులు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తమను కించ పరిచే విధంగా సన్నివేశాలు చిత్రీకరించారంటూ బ్రాహ్మణ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు.
సినిమా విషయంలో పలు బ్రాహ్మణ సంఘాల నుంచి వచ్చిన అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉన్నత అధికారులతో ఓ కమిటీని నియమించింది. ఈ నెల 10 లోగా కమిటీ సభ్యులు సినిమాను పరిశీలించి నివేదికను సమర్పించవలసిందిగా ప్రభుత్వం కోరడమైంది.
ఈ సంగతి ఇలా ఉంటే.. మరో వైపు చెన్నయ్, తిరుపతి నుంచి వచ్చిన బ్రాహ్మణులు మోహన్ బాబుకు అండగా నిలిచారు. మోహన్ బాబు ఎంతో మంచి వ్యక్తి, సేవా పరుడు అంటూ కొనియాడారు. మోహన్ బాబుకు పిండం పెట్టిన కొందరు బ్రాహ్మణుల వైఖరిని మోహన్ బాబుకు అండగా నిలిచిన బ్రాహ్మణులు తప్పుబట్టారు.


Click it and Unblock the Notifications











