»   » పెళ్లికి ముందు సెక్స్ నా ఇష్టం: దీపిక పదుకోన్ (వీడియో)

పెళ్లికి ముందు సెక్స్ నా ఇష్టం: దీపిక పదుకోన్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ నటి దీపిక పదుకోన్ ‘మై చాయిస్' వీడియో సంచలనం సృష్టిస్తోంది. భారతీయ సమాజంలో మహిళపై చూపుతున్న వివక్ష, మహిళలపై జరుగుతున్న దారుణాలు, మహిళల స్వేచ్ఛకు భారతీయ సమాజం ఏవిధంగా అడ్డు పడుతున్న విధానాన్ని ప్రశ్నిస్తూ ఈ వీడియో సాగింది.

Deepika Padukone

మహిళల్లో ఉన్న స్వతంత్ర భావాలకు రిఫ్లక్ట్ చేస్తూ సాగిన ఈ షార్ట్ ఫిల్మ్‌కు బాలీవుడ్ దర్శకుడు హోమీ అదజనియా దర్శకత్వం వహించారు. ‘మా శరీరం, మా మైండ్, మా ఇష్టం' అంటూ..... మా ఇష్టం వచ్చినట్లు మేము ఉంటాము అంటూ సాగిన వీడియోలో వివిధ రంగాలకు చెందిన 99 మంది మహిళా ప్రముఖులు పాలు పంచుకున్నారు. మహిళ స్వేచ్ఛ గురించి సమాజంలోకి ఒక బలమైన మెసేజ్ వెళ్లేలా దీన్ని రూపొందించారు. ఈ దేశంలోని అందరు మహిళలకు, మహిళా శక్తికి దీన్ని అంకితం చేసారు.

మహిళల వస్త్రధారణ వల్లే దేశంలో లైంగిక దాడులు జరుగుతున్నాయనే కొందరి వాదనకు ఈ వీడియో ద్వారా గట్టి కౌంటర్ ఇచ్చారు. నేను ఎలా జీవించాలి, ఎలాంటి దుస్తులు వేసుకోవాలి, నా శరీరం ఎలా ఉండాలన్నది పూర్తిగా నా ఇష్ట ప్రకారమే జరుగుతుంది. పెళ్లికి ముందు సెక్స్, పెళ్లి తర్వాత సెక్స్ అనేది పూర్తిగా నా ఇష్టం. నా వివాహం నాకు నచ్చినట్లు జరుగడమే కాదు..నా జీవితాన్ని పురుషుడితో పంచుకోవాలా? లేక స్త్రీతో పంచుకోవాలనేది కూడా పూర్తిగా నా ఇష్టం..అంటూ ఘాటుగా స్పందించింది దీపిక. స్త్రీల వస్త్రధారణ, ఉద్యోగాల ఆధారంగా వారి వ్యక్తిత్వాన్ని బేరీజు వేసే విధానాన్ని మగవారు మానుకోవాలని దీపిక వీడియో ద్వారా చెప్పుకొచ్చింది.

English summary
Bollywood actress Deepika Padukone dared Indian society and said loudly, "My body, my mind, my choice." The actress along with many other women from different field was seen in a bold video.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu