నాన్న చెప్పారు, అభిమానులకు ట్రీట్: మహేష్ బాబు

By Bojja Kumar

హైదరాబాద్: ‘ఆగడు' చిత్రంపై మహేష్ బాబు పూర్తి నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం భారీ విజయం సాధిస్తుందని జోష్యం చెప్పారు. కెరీర్లో మూడో సారి పోలీసాఫీసర్ పాత్రలో కనిపించబోతున్న మహేష్ బాబు కాప్ పాత్రలో హాట్రిక్ కొట్టాలనే ఆలోచనలో ఉన్నాడు.

సినిమా గురించి మహేష్ బాబు మాట్లాడుతూ...‘ఆగడు చిత్రం సూపర్ హిట్ అవుతుంది. టీజర్ నాన్న చూసిన వెంటనే ఈ చిత్రం నా కెరీర్లో టర్నింగ్ పాయింట్ అవుతుందని చెప్పారు. శ్రీను వైట్ల వర్కింగ్ స్టైల్ బాగుటుంది. ఆయనపై పూర్తి నమ్మకం ఉంది. ముఖ్యంగా ఈ సినిమా కోసం ఆయన రెడీ చేసిన పంచ్ డైలాగులు అభిమానులకు ట్రీట్ లాంటిది' అన్నారు.

My dad watched the Aagadu teaser: Mahesh Babu

ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా మహేష్ బాబు సరసన తొలిసారిగా హీరోయిన్‌గా నటిస్తోంది. అందాల ఆరబోతతో అమ్మడు అదరగొట్ట బోతోంది. అదే విధంగా శృతి హాసన్ ఐటం సాంగు కూడా పెట్టడం ద్వారా సినిమాలో గ్లామర్‌కు లోటు లేకుండా ప్లాన్ చేసాడు దర్శకుడు శ్రీను వైట్ల.

ఇటీవలే ఈచిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం సెన్సార్ కోసం ఫస్ట్ కాపీ రెడీ అయింది. రేపు సెన్సార్ పూర్తయ్యే అవకాశం ఉంది. తమన్ అందించిన ఆడియోకు అభిమానుల నుండి మంచి స్పందన వస్తోంది. 'దూకుడు' వంటి భారి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత మహేష్ బాబు, శ్రీను వైట్ల, తమన్ కాంబినేషన్లో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా ఇది. అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాతలు. సెప్టెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X