నా కూతురు నలుపు, కానీ చాలా అంగత్తె: షారుక్ ఖాన్
ఈ ప్రపంచంలో ఏ తండ్రికైనా తన కూతురు అందంగానే కనిపిస్తుంది. బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కూడా అందుకు మినహాయింపు ఏమీ కాదు. ఇటీవల కోల్‌కతా ఫిల్మ్‌ఫెస్టివల్ కు వచ్చిన షారుక్ తన కూతురు సుహానా గురించి ప్రస్తావించారు. ఆమె రంగు తక్కువగా ఉన్నా నాకు ఈ ప్రపంచంలోనే అందమైన అమ్మాయిగా కనిపిస్తుంది. ఈ విషయంలో మరో అభిప్రాయానికి చోటు లేదని షారుక్ అన్నారు.
షారుక్ ఖాన్ ప్రమోట్ చేస్తున్న కొన్ని వస్తువుల్లో ఫెయిన్‌నెస్ క్రీమ్ లాంటి ఉత్పత్తులు ఉండటంపై కొంతకాలంగా వివాదం నడుస్తున్న నేపథ్యంలో కొందరు విలేఖరులు ఈ విషయమై ప్రశ్నించారు. ఈ సందర్బంగా షారుక్ ఖాన్ ఆసక్తికరంగా స్పందించారు.
''నా కూతురు సుహానా చామన్ ఛాయలో ఉంటుంది. కానీ ఆమె నాకు ఈ ప్రపంచంలో అత్యంత అందమైన అమ్మాయి. ఎదుటి వారి లుక్ ఆధారంగా, రంగు ఆధారంగా ఒక మనిషిని తానెప్పుడూ జడ్జ్ చేయబోను'' అని షారుక్ తెలిపారు.

ఇటీవలే 18 సంవత్సరాలు నిండిన సుహానా వోగ్ మేగజైన్ కవర్ పేజీపై దర్శనమిచ్చారు. ఈ ఇంటర్వ్యూలో భవిష్యత్తులో నటిని కావాలనే తన మనసులోని కోరికను బయట పెట్టారు. ప్రస్తుతం సుహానా లండన్లోని ప్రైవేట్ బోర్డింగ్ స్కూల్‌లో చదువుకుంటోంది.
16 సంవత్సరాలకే ఇంటి నుంచి బయటకు రావడం నేను తీసుకున్న ఉత్తమ నిర్ణయం. డిఫరెంట్ ఎన్విరాన్మెంట్లో జీవించడం, ఎంతో మంది కొత్త వారిని కలవడం వల్ల నాలో కాన్ఫిడెన్స్ మరింత పెంచుతోంది అని సుహానా తెలిపారు.


Click it and Unblock the Notifications











