నా కూతురు అలాంటిది కాదంటున్న స్టార్ హీరో
బాలీవుడ్ స్టార్స్ ఐశ్వర్యరాయ్-అభిషేక్ బచ్చన్ అందమైన పాపాయికి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. తమ పాపాయికి అద్భుతమైన, అందమైన పేరు పెట్టేందుకు బచ్చన్ కుటుంబం ప్రయత్నిస్తున్నారు. బచ్చన్ కుటుంబ సభ్యులు ఆమె పేరు డబల్ A అక్షరంతో మొదలయ్యేలా చూస్తున్నారని, "Aaliyah" అనే పేరును పరిశీలిస్తున్నారని మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై అభిషేక్ స్పందిస్తూ....ఆ ప్రచాంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు.
మీ కూతురు బాగా అల్లరి చేస్తూ...మీ కుటుంబీలకు రాత్రుళ్లు నిద్రలేకుండా చేస్తుందట కదా..? అని కొందరు విలేకరులు ప్రశ్నించగా.....''నో, నా కూతురు అలాంటిది కాదు..మై డాటర్ వెరీ గుడ్ బేబీ, నిద్రపోవడానికి అనుమతిస్తుంది'' అంటూ సమాధానం ఇచ్చారు అభిషేక్.
ఆ సంగతి పక్కన పెడితే...అబిషేక్ తండ్రి అమితాబ్‌బచ్చన్‌కు శనివారం ఉదయం ఆపరేషన్ జరగనుంది. కడుపునొప్పితో బాధపడుతున్న ఆయనకు వైద్యులు ఈ శస్త్రచికిత్సను చేస్తున్నారు. తనకు జరగబోయే ఆపరేషన్ గురించి తన బ్లాగ్ లో రాస్తూ అది సంక్లిష్టమైంది కాదని డాక్టర్లు చెప్పినట్లు బిగ్‌బీ పేర్కొన్నారు. ఆ బ్లాగ్ లో... ''కడుపు నొప్పి నుంచి ఉపశమనం కలిగించే సర్జరీ అంతగా జటిలమైంది కాదని, సులభంగా పూర్తవుతుందని చెప్పారు.


Click it and Unblock the Notifications











