నా కూతురు సేఫ్: కోన వెంకట్
హైదరాబాద్: అమెరికాలో ప్రస్తుతం హరికేన్స్ (ప్రచండ సుడిగాలులు) బీభత్సం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్ 23 ఏళ్ల కూతురు కావ్య ఇటీవల సాండీ హరికేన్ నుంచి తృటిలో తప్పించుకుంది. ఈ విషయాన్ని కోన వెంకట్ స్వయంగా వెల్లడించారు.
కావ్య కోన అమెరికాలోని న్యూయార్క్‌లో 'ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ అండ్ డిస్పూట్ సర్వీసెస్' డిపార్ట్ మెంట్ లో పని చేస్తోంది. ఆమె ఆఫీసు నుంచి ఇంటికి తిరిగి వెలుతుండగా సాండీ హరికేన్ లో చిక్కుకుపోయింది. అయితే ఎలాగో అలా ఆమె సురక్షితంగా ఇంటికి చేరుకుందని, ప్రస్తుతం ఆమె ఇంటి నుంచే వర్క్ చేస్తోందని కోన వెంకట్ చెప్పుకొచ్చారు.
ఇటీవల వచ్చిన 'దూకుడు' చిత్రానికి అదరిపోయే స్ర్కిప్టు అందించిన కోన వెంకట్ ప్రస్తుతం... శ్రీను వైట్ల, జూ ఎన్టీఆర్ కాంబినేషన్లో రూపొందుతున్న 'బాద్ షా' చిత్రానికి పని చేస్తున్నారు. ఆయన పని చేసిన 'దేనికైనా రెడీ' చిత్రం మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.
మరో ఆసక్తికర సమచారం ఏమిటంటే... ఈచిత్రం యూఎస్ రైట్స్ దక్కించుకునేందుకు కోన వెంకట్ ట్రై చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా ఇటీవల వెల్లడించారు. ''బాద్ షా యూఎస్ రైట్స్ కావాలని నిర్మాత బండ్ల గణేష్ ను అడిగా, రేటు పెద్ద మ్యాటర్ కాదు...ఆయన నుంచి పాజిటివ్ రిప్లై వస్తుందని ఆశిస్తున్నా...' అంటూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











