బాలకృష్ణతో వద్దనటానకి కారణమేమిటంటే..ఇలియానా
బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వంటి సీనియర్ హీరోలతో ఇంతవరకు చేయకపోవడానికి కారణం.. వాళ్లతో పనిచేసే అవకాశాలు వచ్చాయి కానీ, నాకు ఆఫర్ చేసిన పాత్రలు నచ్చకపోవడం వల్లనో, కాల్షీట్ల సమస్య వల్లనో అవి ఇంతవరకు వీలు పడలేదు అంటూ తేల్చేసింది ఇలియానా. అలాగే ఫలానా వాళ్లతోనే పనిచేయాలనే నిబంధన ఏదీ నేను విధించుకోలేదు. మంచి పాత్రలు వస్తే ఎవరితోనైనా చేయడానికి నేను సిద్ధమే అని ప్రకటించింది.
హీరోల విషయానికొస్తే మై ఆల్‌టైమ్ ఫేవరైట్ యాక్టర్ రవితేజ. అతనితో పనిచేయడం ఎంత సరదాగా, ఎంత సౌకర్యంగా ఉంటుందో అంటూ మనస్సులో మాట చెప్పింది ఇలియానా. అలాగే దర్శకుల్లో నాకు బాగా నచ్చినవాళ్లు పూరి జగన్నాథ్, త్రివిక్రమ్ శ్రీనివాస్. వీళ్లతో మంచి అవగాహన కుదిరింది.సురేందర్ రెడ్డితో పనిచేయడం కూడా సౌకర్యంగా అనిపించింది. శ్రీలక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆమె రాణా సరసన నటించింది.


Click it and Unblock the Notifications











