నా బయోపిక్ తీస్తే హీరో ఆయనే: ఎఆర్ రహమాన్

By Srikanya

AR Rahman
ముంబై: ఇటీవల జీవిత కథలు వెండితెర మీద సందడి చేస్తున్నాయి. ఈ నేఫధ్యంలో ప్రముఖ సంగీత దర్శకుడు,ఆస్కార్ విజేత ఎఆర్ రహమాన్ ...జీవిత కథతో సినిమా తీస్తే ఎవరైతే ఆయన పాత్రకు సరిపోతారనే ప్రశ్న అందరిలో ఉదయిస్తుంది. అదే ప్రశ్న ఎఆర్ రహమాన్ ని మీడియా వారు అడగటం జరిగింది. దానికి ఆయన చాలా పాజిటివ్ గా నవ్వుతూ స్పందించారు.

ఎఆర్ రహమాన్ మాట్లాడుతూ... జీవిత కథతో సినిమా ఆలోచన అయితే బాగానే ఉందిగానీ దానికి నేను పూర్తిగా సమ్మతించలేను. చాలా పరిశోధన చేస్తేగానీ జీవిత కథను వెండితెర మీద ఆవిష్కరించలేం. ఒక్కోసారి సినిమా కోసం జీవితాన్ని మార్చి చూపించాల్సిన అవసరం కూడా రావొచ్చు. నాకు అది ఇష్టం ఉండదు. నేను రజనీకాంత్‌కి వీరాభిమానిని. ఆయన నమ్మే అనేక విషయాల్ని నేను నమ్ముతాను. నా జీవితం ద్వారా నేను పొందిన అనుభవం కంటే ఆయన ద్వారా నేను తెలుసుకున్నదే ఎక్కువని అనుకుంటాను. ఒకవేళ రజనీకాంత్‌ నా పాత్రను పోషిస్తే చాలా బాగుంటుంది అని చెప్పుకొచ్చారు.

అలాగే రహమాన్ చాలా రోజుల తరవాత భారీ సంగీత యాత్రకు శ్రీకారం చుడుతున్నారు.. ఈ విషయమై ఆయన స్పందిస్తూ...కొంచెం ఉద్వేగం... కొంచెం భయం.. వెరసి ఓ సరికొత్త అనుభూతికి లోనవుతున్నాను. నా అభిమానుల్ని వ్యక్తిగతంగా వారి దగ్గరకే వెళ్లి కలవబోతున్నా. నా ప్రదర్శనకు వచ్చే అభిమానుల స్పందనను కళ్లారా చూడబోతున్నా. ఈ ప్రదర్శన కాన్సెప్ట్‌తో షోడైరెక్టర్‌ దీపక్‌ గట్టాని నా దగ్గరకు వచ్చారు. పాశ్చాత్య దేశాల్లో నిర్వహించే తరహాలో రోడ్‌ టూర్‌ అని చెప్పగానే నాక్కూడా కొత్తగా అనిపించి చేద్దామన్నాను. ప్రమోటర్‌ మురళీధరన్‌ కూడా కలవడంతో యాత్రకు శ్రీకారం చుట్టాం.

సాధారణంగా నా ప్రదర్శనలు ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్‌, బెంగళూరు తదితర నగరాల్లో సాగుతుంటాయి. కానీ ఈసారి వైవిధ్యంగా కోల్‌కతా, వైజాగ్‌, జైపూర్‌, అహ్మదాబాద్‌లను ఎంచుకొన్నాం. మారుమూల నగరాల్లోని అభిమానుల్ని కూడా కలవాలన్నది ప్రధాన ఉద్దేశం. నేను ఏది చేపట్టినా దానికి వంద శాతం న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ ప్రదర్శనల్లో శాస్త్రీయ సంగీతంతోపాటు ఈనాటి సంగీతాన్ని కూడా మిళితం చేస్తూ కొత్తకొత్త ప్రయోగాలు చేయబోతున్నాను.

ఈ యాత్ర నా హృదయానికి హత్తుకొనేలా నిర్వాహకులు తీర్చిదిద్దారు. అంతర్జాతీయ కార్యక్రమాలకు పనిచేసే 'టెక్‌ఫ్రంట్‌' ఆధ్వర్యంలో అత్యున్నత సాంకేతికత ఈ యాత్రలో కనిపిస్తుంది. దీని ద్వారా స్నేహం, శాంతి, సంతోషాలను అందరికీ పంచాలన్నదే మా ప్రధాన ధ్యేయం. మారుమూల ఉన్న ప్రతిభను బయటకు తీసుకొచ్చి సంగీతంలో మన దేశాన్ని మరింత తలెత్తుకొని నిలబడేలా చేయాలని ఆకాంక్షిస్తున్నాను అని చెప్పారు.

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకొన్న ఎ.ఆర్‌.రెహమాన్‌ తాజాగా 'రెహమాన్‌ ఇష్క్‌' పేరుతో సంగీత యాత్రను చేపడుతున్నారు. వచ్చే నెల 1, 12, 20, 27వ తేదీల్లో కోల్‌కతా, వైజాగ్‌, జైపూర్‌, అహ్మదాబాద్‌లో ఈ యాత్రను కొనసాగిస్తారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X