For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పవన్ ఫ్యాన్స్‌కి వ్యతిరేకం కాదు... మీకు అమ్మ, అక్క, చెల్లి ఉన్నారుగా: రేణు దేశాయ్

  By Bojja Kumar
  |
  "I am Not Against To Kalyan Garu's Fans" Renu Desai Said

  పవన్ కళ్యాణ్‌తో విడిపోయి దాదాపు ఏడేళ్లుగా మగతోడు లేని జీవితం కొనసాగిస్తున్న రేణు దేశాయ్.... ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తనకు ఇపుడు ఒక లైఫ్ పార్ట్‌నర్ ఉంటే బావుండనిపిస్తుందనే తన మనసులోని ఆలోచనను బయట పెట్టారు.

  దీనిపై కొందరు స్పందిస్తూ.... మీరు మరో పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు, మేమంతా మిమ్మల్ని ఇప్పటికీ వదినమ్మగానే ట్రీట్ చేస్తున్నాం. మీరు మరో పెళ్లి చేసుకుంటే మిమ్మల్ని హేట్ చేస్తాం అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టారు. దీనిపై రేణు దేశాయ్ ఘాటుగానే స్పందించారు.

  మీడియా కథనాలపై రేణు దేశాయ్ అసంతృప్తి

  మీడియా కథనాలపై రేణు దేశాయ్ అసంతృప్తి

  తాను రెండో పెళ్లి చేసుకోకూడదు అంటూ కామెంట్లు పెట్టిన వారికి రేణు దేశాయ్ ఘాటుగా రిప్లై ఇవ్వడం మీడియాలో మరో రకంగా ప్రచారం జరిగింది. రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ అభిమానులకు వ్యతిరేకంగా ఈ పోస్టు పెట్టారంటూ కథనాలు వచ్చాయి. మీడియాలో ఇలా రావడంపై రేణు దేశాయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

  నేనెక్కడా ఫ్యాన్స్ అని మెన్షన్ చేయలేదు

  నేనెక్కడా ఫ్యాన్స్ అని మెన్షన్ చేయలేదు

  ఫేస్ బుక్ పోస్టులో తన ఎక్స్ హస్బెండ్ ఫ్యాన్స్‌ను ఉద్దేశించి అని ఎక్కడా మెన్షన్ చేయలేదని, అయినప్పటికీ కొన్ని మీడియా సంస్థలు తన పోస్టు పవన్ కళ్యాణ్ అభిమానులకు వ్యతిరేకంగా అని రాశారని.... తన ఉద్దేశ్యం అది కాక పోయినా వారు అలా రావడం బాధించిందని రేణు దేశాయ్ అన్నారు.

  చాలా క్లీయర్ గా రాశాను

  చాలా క్లీయర్ గా రాశాను

  నేను నా పోస్టులో చాలా క్లీయర్ గా రాశాను. ఇది నా పర్సనల్ ఇష్యూ గురించి కాదు అని. ఈ దేశ పౌరురాలిగా ఈ సమాజంలో కొందరు ఆలోచిస్తున్న తీరును నేను ఎండగట్టాను.... అని రేణు దేశాయ్ తెలిపారు.

  మీకు అమ్మ, అక్క, చెల్లి ఉన్నారు...

  మీకు అమ్మ, అక్క, చెల్లి ఉన్నారు...

  అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే. ఉమెన్ ఫ్రీడమ్, ఎడ్యుకేషన్, హెల్త్ సీరియస్ గా తీసుకోండి. మీ అందరికీ అమ్మ, అక్క, చెల్లి ఉన్నారు. ఇది నా కోసం కాదు, వాళ్ల కోసం చేయండి. చదువు, పని విషయంలో సెక్యూర్, ప్రొటెక్టెడ్ ఫీలింగ్ వారికి కల్పించండి.... అని రేణు దేశాయ్ అభిప్రాయ పడ్డారు.

  ఇలాంటివి మానండి

  ఇలాంటివి మానండి

  మీడియా ఛానల్స్ వారు మహిళా సాధికారత కోసం తోడ్పడండి, ఆ దిశగా కృషి చేయడండి..... ఇలాంటి మిస్ అండర్ స్టాండింగ్, డ్రామాలు క్రియేట్ చేయడం లాంటివి మానండి అంటూ రేణు దేశాయ్ హితవు పలికారు.

  ఇంతకు ముందు ఫేస్ బుక్ పోస్టులో రేణు దేశాయ్ ఇలా....

  ఇంతకు ముందు ఫేస్ బుక్ పోస్టులో రేణు దేశాయ్ ఇలా....

  పవన్ కళ్యాణ్‌తో విడిపోయినప్పటికీ.... ఆమెను తమ వదినమ్మగా భావిస్తున్న కొందరు అభిమానులు ఆమె రెండో పెళ్లి ఆలోచన చేయడాన్ని సహించలేక పోతున్నారు. ఆమె సెకండ్ మ్యారేజ్ థాట్స్ మీద తమ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు చేశారు. దీనిపై రేణు దేశాయ్ ఘాటుగా స్పందించారు. ఇవి కేవలం నన్ను ఉద్దేశించి చేసిన కామెంట్స్ అని నేను అనుకోవడం లేదు. కానీ ఇలాంటి కామెంట్స్ చదివినపుడు అసలు మనం ఇలాంటి సమాజంలో, ఇలాంటి మైండ్ సెట్‌లో ఉన్న మగవాళ్ల మధ్య బ్రతుకుతున్నామా? అని చాలా ఆందోళన అనిపిస్తుంది.... అని రేణు దేశాయ్ అన్నారు.

  చేతల్లో కనిపించడం లేదు

  చేతల్లో కనిపించడం లేదు

  ఒక వైపు ఉమెన్ ఈక్వాలిటీ, ఆడపిల్లల శక్తి, రేప్స్ నుండి సెక్యూరిటీ, భద్రత గురించి మాట్లాడుతున్నాము.... కానీ ఇవన్నీ మాటల్లోనే తప్ప మగాళ్ల మైండ్ సెట్లో లేవని రేణు దేశాయ్ అన్నారు.

  రెండో పెళ్లి చేసుకుంటానంటే ద్వేషిస్తారా?

  రెండో పెళ్లి చేసుకుంటానంటే ద్వేషిస్తారా?

  7 సంవత్సరాల నుండి నేను ఒంటరిగా ఉండి, ఇపుడు నాకు ఒక లైఫ్ పార్ట్‌నర్ ఉంటే బావుండు అని జస్ట్ నా అభిప్రాయం వ్యక్తం చేసినందుకు నాకు హేట్ ముసేజెస్ పంపిస్తున్నారు..... అంటూ కొందరు మగాళ్ల తీరును ఆమె తప్పుబట్టారు.

  మగాడు ఎన్నిపెళ్లిళ్లైనా చేసుకోవచ్చా?

  మన దేశంలో ఒక మగాడు ఏమైనా చేయవచ్చు. ఎన్ని సార్లైనా పెళ్లి చేసుకోవచ్చు. కానీ... ఒక అమ్మాయి ఇంకో రిలేషన్ గురించి ఆలోచించడం కూడా తప్పు. తను లైఫ్ లాంగ్ తప్పు చేశానన్న ఫీలింగుతో ఒంటరిగా బ్రతకాలా?.... అంటూ రేణు దేశాయ్ ప్రశ్నించారు.

  మీ చేతుల్లోనే...

  ఈ దేశంలో అమ్మాయిల ఫ్యూచర్ బాగుండాలంటే మహిళలే వాళ్ల కొడుకులను పద్దతిగా పెంచాలి. అప్పుడైనా మగవాళ్ల మైండ్ సెట్ లో మార్పు వస్తుందేమో...... అంటూ రేణు దేశాయ్ వ్యాఖ్యానించారు.

  English summary
  "In yesterdays post I have no where mentioned the word FAN of my ex husband... Media and some people are making this about me against Kalyan Garu's fans. Nenu chala clear gaa rasanu, ee post naa personal issue gurinche kadhu. This is a social thought I have shared as a citizen of this country. I request all of you to take the issue of women freedom, education, health seriously! Mee andaraki amma, akka, chelli unnaru...Idhi naa kosam kadhu, vallu kosam cheyyandi...give them a secure and protected feeling to study, work and have their own emotional freedom. And I sincerely request media channels to use their power of television reach positively instead of just creating drama and misunderstandings! I request all men to come together for your own family members who are women! Thank you." Renu desai said.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X