నాగార్జున... ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అయోమయం: క్లారిటీ ఇచ్చిన వర్మ
నాగార్జునతో చేయబోయే సినిమా గురించి రామ్ గోపాల్ వర్మ క్లారిటీ ఇచ్చారు. నవంబర్లో మొదలవుతుందని తెలిపారు.
నాగార్జున హీరోగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'శివ' సినిమా ఎంత పెద్ద హిట్టయిందో అందరికీ తెలిసిందే. 28 సంవత్సరాల క్రితం వచ్చిన ఈచిత్రం ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. తర్వాత వీరి కాంబినేషన్లో 1994లో 'గోవిందా గోవిందా' సినిమా వచ్చింది కానీ బాక్సాఫీసు వద్ద వర్కౌట్ కాలేదు.
చాలా లాంగ్ గ్యాప్ తర్వాత రామ్ గోపాల్ వర్మ, నాగార్జున కాంబినేషన్లో సినిమా రాబోతోంది. ఈ విషయాన్ని అటు నాగార్జున, ఇటు వర్మ కూడా అఫీషియల్ గా ఖరారు చేశారు. నవంబర్ నుండి షూటింగ్ ప్రారంభం కాబోతోంది.

ఏ సినిమా ముందు అనే అయోమయం
అయితే రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ప్రకటించి దాని గురించి సోషల్ మీడియా జోరుగా పబ్లిసిటీ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో నాగార్జున సినిమా ముందు మొదలవుతుందా? లేక ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం మొదలవుతుందా? అనే అయోమయం నెలకొంది. కొందరేమో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో నాగార్జున నటిస్తున్నారని అపోహ పడ్డారు కూడా.

క్లారిటీ ఇచ్చిన వర్మ
ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ ఈ అయోమయానికి తెరదించారు. తన తర్వాత సినిమా నాగార్జునతో ఉంటుందని, ఈ చిత్రం నవంబర్లో షూటింగ్ మొదలై ఫిబ్రవరిలో ముగుస్తుందని, ఏప్రిల్ నెలలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామన్నారు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' మూవీ ఏప్రిల్ లో షూటింగ్ మొదలై సెప్టెంబర్ 2018లో విడుదలవుతుందని తెలిపారు.

ఖరారు చేసిన నాగార్జున
ప్రస్తుతం రాజుగారి గది 2 విజయంతో మంచి జోష్ మీద ఉన్న నాగార్జున... మానసిక పరమైన వత్తిడి నుంచి బయటపడటానికి నేను ఓ పదిరోజులు యూఎస్ కి వెళుతున్నారు. ఇక్కడి నుండి తిరిగి వచ్చిన తర్వాత వర్మ సినిమా చేయబోతున్నట్లు తెలిపారు.

యాక్షన్ మూవీ
కొంతకాలంగా వరుసగా ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, ఎమోషనల్ మూవీస్ చేసి బోర్ కొట్టేసింది. యాక్షన్ మూవీ చేస్తే బాగుంటుందనుకుంటున్న సమయంలో రామ్ గోపాల్ వర్మ ఒక స్క్రిప్ట్ పంపించాడని, అది పూర్తిస్థాయి యాక్షన్ నేపథ్యంలో కొనసాగుతుంది. కథ బాగా నచ్చేయడంతో వెంటనే ఓకే చెప్పేశానని నాగార్జున తెలిపారు.


Click it and Unblock the Notifications











