twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాంచరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్.. షాకిచ్చిన నిర్మాత, అంత ధైర్యం ఏంటి!

    |

    Recommended Video

    Dvv Danaiah My Dream Fulfilled Making Bharat Ane Nenu (Video)

    మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ భారీ మల్టీస్టారర్ చిత్రంలో నటించబోతున్న సంగతి తెలిసిందే. దర్శక ధీరుడు రాజమౌళి టేకప్ చేయబోతున్న కొత్త ప్రాజెక్ట్ ఇది. ఇప్పటికే ఈ చిత్రం గురించి అధికారికంగా ప్రకటన చేసిన సంగతి తెలిసియందే. సినిమా అయితే ప్రకటించారు కానీ దీనికి సంబందించిన వివరాలని మాత్రం రాజమౌళి దాచివుంచారు. ఎలాంటి కథతో రూపొందబోతోంది, రాంచరణ్, ఎన్టీఆర్ పాత్రల వివరాలు తదితర అంశాలన్నీ ఇప్పటికీ అభిమానులకు ఉత్కంఠే. ఇంత వరకు కనీవినీ ఎరుగని మల్టీస్టారర్ గా రూపొందబోతోందంటూ ఉహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం గురించి ఎట్టకేలకు నిర్మాత డివివి దానయ్య ఓ విషయాన్ని వెల్లడించారు. సినిమాపై ఇప్పటినుంచే అంచనాలు పెరిగేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి.

    అదరగొట్టే మల్టీస్టారర్

    అదరగొట్టే మల్టీస్టారర్

    బాహుబలి లాంటి భారీ చిత్రాన్ని తెరకెక్కించిన తరువాత రాజమౌళి అంత పెద్ద సినిమా చేయకపోవచ్చని సినీవర్గాలు భావించాయి. కానీ ఆయన మరలా పెద్ద బరువు భాద్యతలనే మోయబోతున్నారు. రాంచరణ్, ఎన్టీఆర్ తో భారీ మల్టీస్టారర్ చిత్రం ప్రకటించి ఆశ్చర్యపరిచారు.

    ఇద్దరితో పనిచేసిన అనుభవం

    ఇద్దరితో పనిచేసిన అనుభవం

    ఇద్దరు స్టార్ హీరోలతో మల్టీస్టారర్ చిత్రాలు చేయడం అంటే మామూలు విషయం కాదు. తెలుగులో ఇలాంటి కాంబినేషన్స్ చాలా అరుదుగా వస్తుంటాయి. రాంచరణ్, ఎన్టీఆర్ ఇద్దరితో రాజమౌళికి సినిమాలు చేసిన అనుభవం ఉంది. దీనితో తన తదుపరి చిత్రానికి రాజమౌళి ఈ ఇద్దరు స్టార్స్ ని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది.

     దానయ్య చెప్పిన విషయం, అంత ధైరం ఏంటి

    దానయ్య చెప్పిన విషయం, అంత ధైరం ఏంటి

    ఎన్టీఆర్, రాంచరణ్ మల్టీస్టారర్ చిత్రానికి డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం గురించి ఆయన ఎట్టకేలకు నోరు విప్పారు. రాజమౌళి రూపొందించే చిత్రం దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనుందని షాక్ ఇచ్చారు. మొదట ఈ చిత్రం 150 కోట్ల బడ్జెట్ అవుతుందని వార్తలు వచ్చాయి. దానయ్య 300 కోట్లు అని చెప్పడంతో ఆయన ధైర్యం ఏంటని అంతా చర్చించుకుంటున్నారు.

    ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైంది

    ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైంది

    ఈ చిత్రానికి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభించామని దానయ్య అన్నారు. ఆర్ట్ డిపార్ట్మెంట్ సెట్ కి సంబంధించిన పనులు ప్రారంభించిందని దానయ్య అన్నారు. ఈ చిత్రానికి 300 కోట్ల బడ్జెట్ అవుతుందని ప్రాధమిక అంచనాకు వచ్చినట్లు ఆయన తెలిపారు.

     రాజమౌళి టాప్ డైరెక్టర్

    రాజమౌళి టాప్ డైరెక్టర్

    రాజమౌళి గారు టాప్ డైరెక్టర్. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనిషి. ఈ చిత్రంతో ఆయన అభిమానులకు విజువల్ ట్రీట్ ని అందిస్తారని దానయ్య తెలిపారు. దానయ్య ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ నటించిన భరత్ అనే నేను చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా రాజమౌళి చిత్రం గురించి నోరు విప్పారు.

    English summary
    My film with Rajamouli is Rs 300 crore says DVV Danayya. He reveals interesting details about RRR
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X