twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినిమాకు రూ.100 కోట్లు-కరీనా ఫుల్ హ్యాపీ

    By Bojja Kumar
    |

    కరీనా కపూర్ ను ఇప్పడు అంతా వంద కోట్ల హీరోయిన్ అని పిలుస్తున్నారు. కొంపతీ వంద కోట్లు రెమ్యూనరేషన్ అనుకునేరు. అంత డబ్బు ఆవిడేకే ఇస్తే నిర్మాత అడుక్కు తిన్సాలిందే. విషయం ఏమిటంటే...తంలో కరీనాకపూర్ నటించిన 'త్రీ ఇడియట్స్, గోల్‌మాల్, బాడీగార్డ్" చిత్రాలు కూడా వంద కోట్ల కలెక్షన్ల మార్క్‌ను దాటాయి. ఇది నిజంగా కరీనా కెరియర్లో హాట్రిక్. తాజాగా విడుదలకు సిద్ధమైన ఆమె చిత్రం రా.వన్ దాదాపు 100కోట్లకు పైగా బిజినెస్ చేయొచ్చని మార్గెట్ విశ్లేషకుల అంచనా. అదే జరిగితే కరీనాను బీట్ చేయడం ఇకపై ఏ హీరోయిన్ తరం కూడా కాదేమో..?

    ఈ విషయమై ఆమె స్పందిస్తూ 'అమీర్ ఖాన్, అజయ్ దేవ్‌గన్, సల్మాన్‌ఖాన్‌లతో నటించిన మూడు చిత్రాలు వందకోట్ల కలెక్షన్లను రాబట్టాయి. ఇప్పుడు షారుక్‌తో నటించిన రా.వన్ చిత్రం కూడా కమర్షియల్‌గా 100 కోట్లు వసూళ్లు దాటుతుందని విశ్లేషించడం ఆనందంగా వుంది. ఏ కథానాయికకైనా కమర్షియల్ సక్సెస్ చాలా ముఖ్యం. నా అభిమానుల్ని అలరించడమే నా కర్తవ్యం వాళ్ల ఆశీస్సులతో మరిన్ని విజయాలు సాధిస్తానని చెబుతోంది.

    English summary
    With 'Ra.One' touted to cross the 100-crore mark at the box office as it releases this Diwali, Kareena Kapoor is staring at her fourth film to achieve such a feat and the actress says it is great that her films are competing with each other.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X