twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్‌ కళ్యాణ్‌ అంతగా ఎందుకు నచ్చాడో..?!

    By Sindhu
    |

    పవన్‌ కళ్యాణ్‌ అంతగా ఎందుకు నచ్చాడో? ఆయన చిత్రంలో గెంతటానికి మినహా ఎవరు వచ్చినా ఏదో సాకు చెప్పి పంపిచేస్తుంది ఓ సెక్సీ హీరోయిన్. హీరోయిన్‌ గా రెండుమూడు సినిమాలు చేసినా పెద్దగా లాభం లేకపోవడంతో ఐటంగాళ్‌ గా చేయడానికి సిద్ధపడింది. ఇంతకీ ఈ భామ పేరు ఏంటనే కదా మీ ప్రశ్న. ఆమే పార్వతి మెల్టన్‌.

    మాంచి సెక్సీగా పొడుగు కాళ్లసుందరిగా కన్పించే ఈ అమ్మడు గెస్ట్‌ అప్పీయరెన్స్‌ గా ఐటంగాళ్‌ గా నటిస్తోంది. తను నటించిన చిత్రాలన్నీ హిట్‌ అయ్యాయి. జల్సా, దూకుడు మంచి కలెక్షన్లు రావడంతో నిర్మాతలు ఆమెను కోరుకుంటున్నారట. కానీ, మీరెవ్వరూ వద్దు. ఒక్క పవన్‌ ఉంటే చాలంటూ తన కోరికను వెల్లడిస్తుంది. ఇటీవలే ఆమెను ఇద్దరు నిర్మాతలు తమ చిత్రంలో చేయమని అడిగారట. వారికి ఏవో సాకులు చెప్పి తప్పించుకున్నదట. దానికి కారణం 'గబ్బర్‌ సింగ్‌'లో పవన్ మంచి ఆఫర్ ఇచ్చాడని సమాచారం. ఆ చిత్రం తర్వాతే ఏదైనా అని వారిని పంపించేసిందట. 'దబాంగ్‌'లో పాపులర్‌ అయిన 'మున్సీ బదనామ్‌..' పాటకు పార్వతి కాలు ఆడిస్తుందట. దీనికోసం నిర్మాత గణేష్‌బాబు బాగానే ముట్టచెబుతున్నట్లు సమాచారం.

    English summary
    If the rumors in the industry are to be believed, she’s being considered for a sizzling item number in Pawan Kalyan’s upcoming film Gabbar Singh. The film is the official remake of Salman Khan’s Dabangg and Malaika Arora had danced for Munni Badnaam Hui which became quite popular last year.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X