మగధీరకు సైన్ చేయడం వలనే.. రాంచరణ్ సినిమాపై కాజల్ కామెంట్!
అందాల చందమామ కాజల్ అగర్వాల్ దశాబ్దం నుంచి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. సౌత్ లో చాలా మంది స్టార్ హీరోల సరసన కాజల్ అగర్వాల్ నటించిన సంగతి తెలిసిందే. ఎన్నో అద్భుతమైన చిత్రాలు కాజల్ పేరిట నమోదయ్యాయి. మూడు పదుల వయసులో కూడా కాజల్ క్రేజీ ఆఫర్స్ అందుకుంటోంది. ప్రస్తుతం కాజల్ తమిళ పింక్ రీమేక్ పారిస్ పారిస్ లో నటిస్తోంది. ఓ ఇంటర్వ్యూలో కాజల్ మాట్లాడుతూ తన సినీ కెరీర్ ని మలుపు తిప్పిన చిత్రం గురించి మాట్లాడింది.

నా గోల్డెన్ టైమ్ మొదలైంది అప్పుడే
కాజల్ తన ఫిల్మ్ కెరీర్ గురించి మాట్లాడుతూ.. రాజమౌళి దర్శత్వం వహించిన మగధీర చిత్రానికి తాను సైన్ చేయడం వలనే గోల్డెన్ టైం మొదలైందని కాజల్ తెలిపింది. నా కెరీర్ లో ఎన్నో అద్భుత విజయాలు చూసాను.. పరాజయాలు చూసాను. అదంతా మగధీర చిత్రం వలనే అని కాజల్ తెలిపింది. మగధీర చిత్రంతో నేను నటిగా మరో స్థాయికి చేరుకున్నా అని కాజల్ అగర్వాల్ తెలిపింది.

రికార్డు విజయం
దాదాపు పదేళ్ల క్రితం విడుదలైన మగధీర చిత్రం ఇండస్ట్రీ రికార్డులని తిరగరాసింది. ఆ చిత్రంలో కాజల్ అగర్వాల్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ జంటగా నటించారు. రాజమౌళి ఈ ప్రేమ కథని అద్భుత దృశ్యకావ్యంగా మలిచాడు. అప్పటివరకు మామూలు హీరోయిన్ గా ఉన్న కాజల్ అగర్వాల్ మగధీర చిత్రంతో స్టార్ గా మారిపోయింది. ఆ తర్వాత చరణ్, కాజల్ కలసి మరికొన్ని చిత్రాల్లో నటించారు.

భారతీయుడు 2లో అవకాశం
కాజల్ అగర్వాల్ ఇటీవల మరో అద్భుత అవకాశాన్ని అందుకుంది. లోకనాయకుడు కమల్ హాసన్ సరసన శంకర్ దర్శకత్వంలో తెరకెక్కే భారతీయుడు 2లో నటించే అవకాశన్ని అందుకుంది. ఈ చిత్రం కోసం ప్రత్యేకమైన యుద్ధ విద్యలు నేర్చుకోవడం చాలా ఆసక్తిగా ఉంది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ సరికొత్త లుక్ లో కనిపించనుంది. ఇటీవల కాజల్ నటించిన కవచం చిత్రం నిరాశపరిచిన సంగతి తెలిసిందే.

2019లో తొలి చిత్రం
ఇదిలా ఉండగా కాజల్ అగర్వాల్ నుంచి 2019లో రాబోతున్న తొలి చిత్రం పారిస్ పారిస్. హిందీ బ్లాక్ బస్టర్ చిత్రం క్వీన్ కు ఇది తమిళ రీమేక్. ఇటీవల విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. హిందీలో కంగనా రనౌత్ నటించిన. క్వీన్ చిత్రానికి గాను అనేక ప్రశంసలు, అవార్డును దక్కాయి. తమిళఎం తెలుగు, మలయాళీ, కన్నడ నాలుగు సౌత్ భాషల్లో ఈ చిత్రం రీమేక్ కానుండడం విశేషం.


Click it and Unblock the Notifications











