twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నన్ను బలిపశువును చేసారు: శ్వేతాబసు (ఇంటర్వూ)

    By Srikanya
    |

    హైదరాబాద్: వ్యభిచారం అంటూ నన్ను ఏ ఏజెంటూ హైదరాబాద్ కు పిలవలేదు. అవార్డుల ప్రధానోత్సవంలో పాల్గొనటానికి అక్కడకు వెళ్లాను. నా తలరాత అనండి..ఇంకోటి అనండి..వెనక్కి వచ్చే విమానం మిస్సయ్యాను. ఆ అవార్డుల కమిటీ నిర్వాహకులే విమానం టిక్కెట్, బస ఏర్పాటు చేసారు. ఈ వ్యవహారంలో బలిపశువుని అయ్యాను. ఆ సమయంలో పోలీస్ దాడి జరిగింది. ఈ సంఘటనను తోసి పుచ్చటం లేదు. కానీ బయిటకు చెప్పేవన్నీ నిజాలు కావు అంటూ భాధగా చెప్పారు శ్వేతాబసు.

    అలాగే...ఓ ప్రముఖ మీడియా సంస్ధకు చెందిన జర్నలిస్టుపై శ్వేతబసు నిప్పులు కక్కారు. దాదాపు అరవై రోజులు తర్వాత రెస్కూ హోమ్ నుంచి విడుదలైన ఆమె మీడియాతో మాట్లాడుతూ తాను చెప్పని విషయాల్ని తమ పత్రికలో ప్రచరించటంపై సీరియస్ అయ్యారు. కేసు పెడతానంటూ మండిపడ్డారు.

    వ్యభిచార ఆరోపణలతో అరెస్టై, కోర్టు ఆదేశాలతో ఇటీవలే రెస్కూ హోమ్ నుంచి బయిటకొచ్చిన కొత్త బంగారులోకం హీరోయిన్ శ్వేతాబసు హీరోయిన్ తొలిసారిగా నోరు విప్పింది. ముంబైలోని తన ఇంటినుంచి అక్కడ పత్రిక డిఎన్ ఎ కు ఇంటర్వూ ఇచ్చింది. అందులో తన వెనుక ఏం జరిగిందో వివరించే ప్రయత్నం చేసారు. తాను అసలు ఏ మీడియాతోనూ మాట్లాడలేదని అన్నారామె.

    శ్వేతాబసు ఆ ఇంటర్వూలో ఏం చెప్పింది.. పూర్తి పాఠం స్లైడ్ షోలో

    శ్వేతాబసు మాట్లాడుతూ...

    శ్వేతాబసు మాట్లాడుతూ...

    నేను కష్టడీలో ఉన్నాను. రెస్కూ హోమ్ లో కనీసం నా తల్లి,తండ్రి ఎవరితోనూ మాట్లాడనివ్వరు. అలాంటి పరిస్ధితుల్లో మీడియాతో ఎలా మాట్లాడతాను. తమకు తోచిన కథనాలు అల్లితే ఎలా. నా సినీ కెరీర్ ముగినట్లే అంటూ నా ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా వార్తలు ప్రచురించారు.

    నా కుటుంబం గురించి తెలుసా

    నా కుటుంబం గురించి తెలుసా

    శ్వేత కోపంతో తన కుటుంబ నేపధ్యం గురించి వారికేమైనా తెలుసా అంటూ ప్రశ్నించారు. అరెస్టు సమయంలో కొన్ని కొన్ని సినీ ఆఫర్లు కూడా నా చేతిలో ఉన్నాయి. సినీ పరిశ్రమతో మంచి సంభంధాలు ఉన్నాయని, ఎంతో మంది స్నేహితులు తనకు ఉన్నాయని, వారంతో ష్టం సమయంలో వెన్నంటి ఉన్నారని తెలిపింది.

    అసలేం జరిగింది

    అసలేం జరిగింది

    నేను ఓ అవార్డు ఫంక్షన్ కోసం అక్కడకి వెళ్ళాను. ఆ కార్యక్రమ నిర్వాహకులు నాకు టిక్కెట్లు, హోటల్ గదిని కేటాయించారు. ఇప్పటికీ నా దగ్గర టిక్కెట్లు ఉన్నాయి. కానీ దురదృష్టం వెంటాడింది. ఆ సమయంలో పోలీస్ లు దాడి చేసారు. ఓ ఏజెంట్ ని అరెస్టు చేసామని, కేసుని విచారిస్తున్నామని నాకు తెలిపారు. కానీ ఆ కేసులో భాధితురాలిగా మారాను. అసలు విషయాలు బయిటకు రాకుండా చేసారు.

    పోలీసులు ఏం అడిగారు

    పోలీసులు ఏం అడిగారు

    వ్యభిచారానికి పాల్పడిన టాలీవుడ్ స్టార్స్ పేర్లు చెప్పమంటూ పోలీసులు అడిగారు. అయితే నేనెందుకు ఇతరులపై కామెంట్ చేయాలి అన్నారామె.

    రెస్యూ హోం లో ఏం చేసానంటే..

    రెస్యూ హోం లో ఏం చేసానంటే..

    నాతో పాటు అక్కడ అక్రమ మానవ రవాణాలో పట్టుబడిన పిల్లలు ఉన్నారు. వాళ్లకు టీచర్ సేవలందించారు. పిల్లలకు హిందీ, ఇంగ్లీష్, హిందూస్ధానీ క్లాసికల్ మ్యూజిక్ నేర్పించాను. ఆ రెండు నెలల కాలాన్ని చక్కగా వినియోగించుకున్నాను.

    ఆ పత్రిక మీదే..

    ఆ పత్రిక మీదే..

    జరిగిన వ్యవహారంలో నాకు ఎవరిమీదా కంప్లైంట్ లు లేవు. కాకపోతే నేను ఏమీ మాట్లాడకుండానే ఆ సంక్షోభ సమయంలో అన్ని దారులూ మూసుకుపోవటం వల్లే ఈ పనికి పాల్పడ్డా. డబ్బు సంపాదించడం కోసం వ్యభిచారంలోకి దిగాల్సిందిగా కొందరు నన్ను ప్రోత్సహించారు అంటూ నా పేరు మీద ఓ జర్నలిస్టు తప్పుడు ప్రకటన జారీ చేసారు. రెండు నెలలు పత్రికలు నాకు అందుబాటులో లేవు. దాని గురించి ఇప్పుడే తెలిసింది.

    శాడిస్టులు

    శాడిస్టులు

    ఎవరైనా కష్టాల పాలై ఇబ్బందులు పడుతూంటే అది చూసి ఆనందించటం మన మానవ జాతి లక్షణం. మనం శాడిష్టులం. నా పేరు మీద తప్పుడు ప్రకటన ప్రచారంలో పెట్టిన ఆ జర్నలిస్టును ఈ విషయమై నిలదీసి అడుగదలుచుకున్నా.

    మీడియా సహకరించింది నిజమే..

    మీడియా సహకరించింది నిజమే..

    నాకు ఎక్కువ భాగం మీడియా అండగా నిలిచిన విషయం వాస్తవమే. అందుకే తిరిగి ఇంటికి రాగలిగాను. జరిగిందేమిటన్న విషయమై లోతుల్లోకి వెళ్లదలుచుకోలదు. అది కోర్టులో ఉన్న విషయం.

    చర్యలు తీసుకుంటాను

    చర్యలు తీసుకుంటాను

    నాపై అవాస్తవాలన్ని ప్రచరించిన జర్నలిస్టు ను, న్యూస్ పేపరు గురించి వివరాలు సేకరిస్తున్నా. అందుకు భాధ్యులైన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటాను అని ఆమె అన్నారు.

     తాతగారు చనిపోయారు

    తాతగారు చనిపోయారు

    నేను రెస్కూ హోమ్ లో ఉండగా మా తాతగారు చనిపోయారు. ఆ భాధ జీవితాంత వెంటాడుతుంది. ఆయన అంత్యక్రియలకైనా హాజరు కాలేదు. జీవితాంతం ఆ బాధ నన్ను దహిస్తుంది. మీడియాలో వార్తలు పుణ్యమా అని నేనే ఆ ప్రకటనలు అన్నీ చేసానని ఆయన కన్ను మూసారు.

    నాకు సానుభూతి వద్దు

    నాకు సానుభూతి వద్దు

    దర్శకుడు హన్సల్ నుంచి నాకు ఫోనేమీ రాలదు. హన్సల్ మెహతా చిత్రానికి ఆడిషన్ లో పాల్గొని, ఆ పాత్రకు నేను సరిపోతేనే చేస్తాను. ఏదో సానుభూతితో వచ్చే పాత్రలు నాకొద్దు. వివాదాన్ని అడ్డు పెట్టుకుని సొమ్ము చేసుకోను.

    జీవితం ఇంతే..

    జీవితం ఇంతే..

    జీవితం ఇంతే..ఇలాగే ఉంటుంది..కష్టకాలంలోనే అసలైన స్నేహుతలు ఎవరన్నది తెలుస్తుంది. తెలిసినవాళ్లు చాలా మంది మొహం చాటేసారు. చాలా మంది అమ్మ ఫోన్ చేస్తే ఎత్తలేదు. ఈ సమయంలో మాకు అండగా నిలిచిన వారందరికీ ధాంక్స్. ఇక మొహం చాటేసిన వాళ్లనూ ఏమీ అనను. జీవితం ఇంతే

    English summary
    Swetha Basu Prasad, the actress who returned to her Mumbai residence after spending two months in a Hyderabad rescue home following her arrest on charges of prostitution, has claimed she was innocent in the entire episode.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X