ఈ నెల 24న 'మై హార్ట్ ఈజ్ బీటింగ్'
ధర్మపధ క్రియేషన్స్ పతాకంపై ఇదివరకు 'గౌతమ బుద్ధ' చిత్రాన్ని నిర్మించిన కె. రాజశేఖర్ తాజాగా 'మై హార్ట్ ఈజ్ బీటింగ్... అదోలా' అనే ప్రేమ కథాచిత్రాన్ని రూపొందిస్తున్నారు. రేవంత్, రాజిత హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి అరుణ్ రుద్ర, కిరణ్ మీగడ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. ఈ నెల 24న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని పూర్తిగా అమెరికాలో చిత్రీకరించడం విశేషం .
నిర్మాత రాజశేఖర్ మాట్లాడుతూ... "మణిశర్మ, ఆర్పీ పట్నాయక్ వద్ద పనిచేసిన మైఖేల్ మక్కల్ బాణీలు అందించారు. వాటిని అమెరికాలోని అందమైన ప్రదేశాల్లో చిత్రీకరణ జరిపాం. సినిమా విషయానికొస్తే - ఇది కేవలం ప్రేమకథ కాదు. పిల్లల, పెద్దల బాధ్యతల్ని కూడా గుర్తుచేసే సన్నివేశాలున్నాయి. అవి మనసుల్ని హత్తుకుంటాయి. అమెరికాలో ఉద్యోగాలు చేస్తూ న్యూయార్క్ స్కూల్ ఆఫ్ యాక్టింగ్‌లో శిక్షణ పొందినవాళ్లు నటించారు. ప్రధాన జంట రేవంత్, రాజిత మంచి నటన ప్రదర్శించారు. తప్పకుండా సినిమా విజయం సాధిస్తుందని నమ్ముతున్నాం'' అని చెప్పారు.
కె. రాజశేఖర్, శ్రీని కొల్లా, సరయు సిరి, రజనీకాంత్, ఫణి, మార్క్, రేష్మి, ఠాకూర్ తారాగణమైన ఈ చిత్రానికి కథ: అరుణ్ రుద్ర, ఛాయాగ్రహణం: మురళి పలికొండ, కొరియోగ్రఫీ: శివ సాయి.


Click it and Unblock the Notifications












