»   »  మై హార్ట్ బ్రేకింగ్: రజనీకాంత్ అల్లుడి ఆవేదన..

మై హార్ట్ బ్రేకింగ్: రజనీకాంత్ అల్లుడి ఆవేదన..

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సాకర్ వరల్డ్ కప్‌లో 'బ్రెజిల్' జట్టుపై అమితమైన అభిమానం పెంచుకున్న తమిళ హీరో ధనుష్....ఆ జట్టు సెమీస్‌లో జర్మీనీ చేతిలో 7-1 తేడాతో ఓటమి పాలవ్వడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేసారు. ఈ ఓటమితో తన హార్ట్ బ్రేక్ అయినంత పనయిందని, తాను ఎప్పటికీ బ్రెజిల్ జట్టునే అభిమానిస్తానని ధనుష్ స్పష్టం చేసారు.

ధనుష్‌కు సంబంధించిన సినిమా వివరాల్లోకి వెళితే..... ప్రస్తుతం మూడు తమిళ ప్రాజెక్టుల్లో, ఒక హిందీ ప్రాజెక్టులో చేస్తూ బిజీగా గడుపుతున్నారు. హిందీలో 'షమితాబ్' అనే చిత్రంలో నటిస్తున్న ధనుష్ ఇందులో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటిస్తున్నాడు. ఈ చిత్రం ద్వారా అక్షర హాసన్ హీరోయిన్‌గా పరిచయమవుతోంది.

My heart still belongs to Brazil: Dhanush

ఇతర విషయాల్లోకి వెళితే..


తన భార్య ఐశ్వర్య దర్శకత్వంలో ఇక ఎప్పటికీ సినిమా చేయనని అల్లుడు ధనుష్ తేల్చి చెప్పారు. ఆ మధ్య తన భార్య ఐశ్వర్య దర్శకత్వంలో వచ్చిన '3' చిత్రం ఘోర పరాజయం పాలవ్వడంతో మళ్లీ తన భార్య దర్శకత్వంలో సినిమా చేయడానికి సాహసించడం లేదు ధనుష్.

ఇక పోతే ధనుష్, ఐశ్వర్య మధ్య కొన్ని విషయాల్లో విబేధాలు వచ్చాయనే రూమర్లు ప్రచారంలోకి వచ్చాయి. దీనికి హీరోయిన్ శృతి హాసనే కారణమేనే పుకార్లు సైతం వినిపిస్తున్నాయి. దీనిపై ధనుష్ స్పందిస్తూ....ఆ వార్తలను ఖండించారు. శృతి హాసన్, తాను మంచి స్నేహితులం అని ధనుష్ స్పష్టం చేసారు.

English summary
Tamil superstar Dhanush is 'heart-broken' after Brazil's loss to Germany in the first semi-final of the 2014 Fifa World Cup but says he will always be a fan of five-time champions.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu